Idream media
Idream media
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అంచనాలు తలకిందులవుతున్నాయి. సీఎం కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వెనుకంజలో ఉంది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన సొంత నియోజకవర్గంలో పట్టునిలుపుకుంటున్నారు. ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడి కాగా ఈటెల రాజేందర్ 1269 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ నుంచి ఈటెల తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్‌లో 166 ఓట్లు ఆధిక్యం సాధించిన ఈటెల రాజేందర్, రెండో రౌండ్‌లో 192, మూడో రౌండ్‌లో 911 ఓట్ల ఆధిక్యం సాధించారు.
పథకాలు, అభివృద్ధి పనులకు వేల కోట్ల రూపాయలు, నామినేటెడ్ పదవులు.. ఇలా శర్వశక్తులు ఒడ్డిన టీఆర్‌ఎస్‌కు.. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు నిరాశను కలిగించాయి. మొదటి రెండు రౌండ్లలో హుజురాబాద్ రూరల్ మండలంలోని ఓట్లను లెక్కించారు. అక్కడ ఈటెలకు బలం ఉందని భావించగా.. అందుకు అనుగుణంగానే ఫలితం వచ్చింది. అయితే హుజురాబాద్ టౌన్‌లో తమకు బలం ఉందని, కారు గుర్తుకే ఆధిక్యత వస్తుందని గులాబీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. అయితే వారి ఆశలు ఆడియాశలయ్యాయి. తమకు పట్టుందన్న హుజురాబాద్ టౌన్‌లోనే ఈటెల రాజేందర్‌కు 911 ఓట్ల మెజారిటీ రావడం విశేషం.
కాగా, బద్వేల్ ఉప ఎన్నికల్లో అంచనాలకు తగినట్లుగానే వైసీపీ దూసుకుపోతోంది. 6 రౌండ్లు ముగిసే సమయానికి వైసీపీకి 64,265 ఓట్లు, బీజేపీకి 12,241 ఓట్లు కాంగ్రెస్‌కు 3,411 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 52,024 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Also Read : Bypoll First Round Result – బద్వేల్‌లో వైసీపీ, హుజురాబాద్‌లో బీజేపీ