హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ప్రచార గడువు శనివారం సాయంత్రం 5గంటలకు ముగియడంతో కొన్నిరోజులుగా హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు మూగబోయాయి. ప్రజాభిప్రాయం మిగిలింది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ నెల 21న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక జరగనుంది. 24న ఫలితం వెలువడనుంది.