iDreamPost
android-app
ios-app

By polls betting- బై పోల్స్ : అక్క‌డ అలా.. ఇక్క‌డ ఇలా..!

By polls betting- బై పోల్స్  : అక్క‌డ అలా.. ఇక్క‌డ ఇలా..!

ఎన్నిక‌లు ఏమైనా భారీ స్థాయిలో పందాలు ఇప్పుడు కామ‌న్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉప ఎన్నిక‌ల సీజ‌న్ న‌డుస్తోంది. ఏపీలోని బ‌ద్వేలు, తెలంగాణ‌లోని హుజూరాబాద్ లో పొలిటిక‌ల్ పార్టీలు వాడివేడిగా ప్ర‌చారం ప‌ర్వంలో మునిగి తేలుతున్నాయి. ఎన్నిక‌ల తేదీలు స‌మీపిస్తుండ‌డంతో ఇప్పుడు పందెంరాయుళ్లు తెర‌పైకి వ‌స్తున్నారు. అయితే, బ‌ద్వేలులో వార్ ఒన్ సైడే కావ‌డంతో అక్క‌డ విపక్షాల డిపాజిట్ ల మీద పందాలు కాస్తున్నారు. బీజేపీకి డిపాజిట్ మీద ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది.మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ ఓటర్ల మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నా పదివేల ఓట్లు రావని కూడా బెట్టింగ్ కడుతున్నారు.

హుజూరాబాద్ లో మాత్రం జోరుగా పందాలు న‌డుస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య పోటాపోటీ ఉండ‌డంతో బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. హుజూరాబాద్ లో గెలుపు కోసం అధికార పార్టీ టీఆర్ ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీజేపీలు భారీ ఎత్తున రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అధికార పార్టీ పథకాలతో విజృంభిస్తుంటే.. బీజేపీ సానుభూతి తో రంగంలోకి దిగింది. దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. అదేసమయంలో బెట్టింగు బంగార్రాయుళ్లు కూడా వాలిపోయారు. `వందకు వెయ్యి.. వెయ్యికి పది వేలు పదివేలకు లక్ష` అంటూ కోడిపందేల సమయంలో కనిపించే ఈ డైలాగులు ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో వినిపిస్తున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది? ఎన్ని ఓట్ల తేడాాతో గెలుస్తుంది.. ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈటెల రాజేందర్ పై పందేలు కడుతున్న వారు పెరుగుతున్నారు. అయితే. ఇదంతా కూడా గుట్టుగా.. ఆన్లైన్ లోనే జరిగిపోతుండడం గమనార్హం. ఈ బెట్టింగుల్లో హైదరాబాద్ వరంగల్ తూర్పు పశ్చిమ గోదావరులు విశాఖపట్నానికి చెందిన చెందిన కొందరు రాజకీయ నేతలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read : Badvel Bypoll – గెలుపోట‌మ‌లుపై కాదు.. వైసీపీ మెజారిటీపైనే చ‌ర్చ‌!

హుజూరాబాద్ ఉపఎన్నిక పై గత నెల నుంచే మొదలైన బెట్టింగ్ గడువు సమీపించడంతో మరింత జోరందుకుంది. తెలంగాణ తోపాటు ఆంధ్రా నుంచి విజయవాడ,తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి,నెల్లూరు, గుంటూరు,విశాఖపట్నంతో పాటు మహారాష్ట్ర లోని షోలాపూర్ ,నాందెడ్ ,ముంబాయ్ వంటి ప్రాంతాల వారు బెట్టింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రా నాయకులు ఇక్కడ తెలిసిన వారికి ఫోన్ చేసి ఈటెల గెలుస్తాడా లేదా? అనే విషయాన్ని ఆరాతీస్తున్నారు. అంతేకాదు, దళిత బంధు ఎంత వరకు అమలైంది? ఎస్సీ ఓటు బ్యాంకు ఎటుంది? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుంటున్నారు.

ఇటీవల ఆంధ్రాకు చెందినవారు వాహనాల్లో హుజూరాబాద్ కు వచ్చి ప్రచార శైలిని గమనించారని తెలిసింది. ఆంధ్రాలో ఎక్కువమంది ఐపీఎల్ బెట్టింగ్లు కట్టినవారు అది ముగియడంతో ఇప్పుడు ఉప ఎన్నికపై దృష్టి పెడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే బెట్టింగ్ విలువ రూ.100 కోట్ల పైనే దాటినట్లు అంచనా. ఈ బెట్టింగ్ నిర్వహించే బుకీలు ఆన్లైన్ లోనే దందా నడుపుతున్నట్లు తెలిసింది. రూపాయికి రూ.10 కొన్ని చోట్ల రూపాయికి రూ.1000 ఇలా కోట్లాది రూపాయాలు బెట్టింగ్ సాగుతోంది. 15 రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఏ నలుగురు కలిసినా ఉప ఎన్నిక గురించి పెద్దస్థాయిలో చర్చిస్తున్నారు.

Also Read : BJP Wanted Agents – బద్వేలు ఉప ఎన్నిక – పోలింగ్‌ ఏజెంట్లు కావలెను..!