iDreamPost
android-app
ios-app

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న బన్నీ

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న బన్నీ

69వ జాతీయ అవార్డుల చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది ప్రకటించిన విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందించారు. జాతీయ ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. పుష్ప చిత్రానికి గానూ ఈ అవార్డు అతడిని వరించింది. కాగా, ఉత్తమ నటుడు కేటగిరీలో తెలుగు నుండి అవార్డును సొంతం చేసుకున్న తొలి హీరో బన్నీ కావడం విశేషం. జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ వెంట ఆయన సతీమణి స్నేహలతా రెడ్డి, తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఈ అవార్డును అందుకునేందుకు ఐకాన్ స్టార్ సతీమణితో సహా హస్తినాపురానికి వెళ్లారు.

అవార్డును స్వీకరించిన సమయంలో అల్లు అరవింద్ ప్రేక్షకుల గ్యాలరీలో ఉండి.. పుత్రోత్సాహంతో పొంగిపోయారు. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరీలో ఉప్పెన సినిమాకు గానూ.. ఆ చిత్ర నిర్మాత యేర్నేని నవీన్ అవార్డును అందుకున్నారు. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాకు గానూ.. కాల భైరవ, పుష్ప సినిమాకు బెస్ట్ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్, నేపథ్య సంగీతానికి కీరవాణి, కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరీలో శ్రీనివాస్ మోహన్, స్టంట్ కొరియోగ్రఫీకి కింగ్ సోలమన్ అవార్డులు అందుకున్నారు. అలానే కొండపొలం పాటకు చంద్రబోస్ కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. ప్రజాదరణ పొందిన చిత్రం కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ను అవార్డు వరించగా.. ఆ సినిమా దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ దాసరి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)