సాధారణంగా పశువులు ఒక ప్రదేశంలోనే నిర్ధిష్టంగా ఉండవు. వాటిని కట్టేస్తేనే తప్ప… పంట పొలాల మీదకు వెళ్తుంటాయి. పశువుల కారణంగా గ్రామాల్లో గొడవలు కూడా జరుగుతుంటాయి. మనుషుల్లో విచక్షణ జ్ఞానం లేనప్పుడే ఇలాంటి వాగ్వాదాలు జరుగుతుంటాయి. సర్ధుకుపోయే గుణం ఉంటే.. ఎలాంటి గొడవలు జరగ్గవు. తాజాగా ఓ వ్యక్తి కూడా అదే గ్రామానికి చెందిన మరోవ్యక్తి ఎడ్లు తన పెరట్లోకి వచ్చాయని విచక్షణ కోల్పోయాడు. ఎడ్ల యజమాని పట్టుకుని కొయ్యకు కట్టేసి కొట్టాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన దుర్గం బాపు అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన సూరం రాం రెడ్డి అనే వ్యక్తి కొయ్యకు కట్టేసి బంధించడం స్థానికంగా కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం బాపు ఎద్దులు .. రాంరెడ్డి పెరట్లోకి వెళ్లి.. మొక్కలను మేశాయి. ఈ విషయం తెలుసుకున్న రామ్ రెడ్డి .. ఎద్దులను తన ఇంటి ఆవరణంలో కట్టేసి పొలంకి వెళ్లాడు. అయితే ఇదే సమయంలో బాపు వచ్చి.. కట్టేసిన ఎద్దులను విడిపించుకుని తీసుకెళ్లాడు. కాసేపుటి తరువాత ఇంటికి వచ్చిన రామ్ రెడ్డికి ఎడ్లు కనిపించలేదు.. దీంతో బాపుపై ఆగ్రహించాడు. నేరు బాపు ఇంటికి వెళ్లి.. దూషణలకు దిగాడు. అంతేకాక బాపును తన ఇంటికి తీసుకొచ్చి.. ఓ కొయ్యకు తాడుతో కట్టేసి కొట్టాడు.
ఈ ఘటన అంతా దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. ఇక బాపు పట్ల రాం రెడ్డి వ్యవహరించిన తీరును గ్రామస్థులు తప్పు బట్టి విడిపించారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన బాపు… రాం రెడ్డిపై ఫిర్యాదు చేశాడు. రాంరెడ్డి తనను కులం పేరుతో దూషించడంతో పాటు ఇంటికి తీసుకెళ్లి కొయ్యకు కట్టేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాపును కులం పేరుతో దూషించాడన్న ఆరోపణతో నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితుడి ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రైల్వే స్టేషన్ సమీపంలో వివాహిత దారుణ హత్య! కిరాతకంగా..