iDreamPost
android-app
ios-app

రైల్వే స్టేషన్ సమీపంలో వివాహిత దారుణ హత్య! కిరాతకంగా..

రైల్వే స్టేషన్ సమీపంలో వివాహిత దారుణ హత్య! కిరాతకంగా..

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉంటాయి.  అంతేకాక అత్యంత దారుణంగా మహిళలు హత్యకు గురైన సంఘటనలు ఎన్నో జరిగాయి. కారుణాలు ఏమైనప్పటికి.. ఆడవాళ్లు కూర్రంగా హత్యగావించ బడుతున్నారు. అక్రమ సంబంధాలు, వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు వంటి కారణాలతో ఈ  ఘోరాలు  జరుగుతున్నాయి. తాజాగా మంచిర్యాలో దారుణం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలో ఓ మహిళను నడి రోడ్డుపై కత్తులతో పొడిచి, రాళ్లతో కొట్టి చంపారు.  ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారి అలజడి చెలరేగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మంచిర్యాల జిల్లా కేంద్రం గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఉల్కిపడింది. రైల్వే స్టేషన్ కు అత్యంత సమీపంలో ఓ మహిళను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన  చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి గోపాలవాడకు చెందిన శరణ్యగా పోలీసులు గుర్తించారు. ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. నిత్యం ఆస్పత్రి నుంచి ఇంటికి  రైల్వే స్టేషన్ సమీపంలో నుంచి వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం కూడా విధులు ముగించుకుని శరణ్య ఇంటికి బయలు దేరింది.

ఇక రైల్వే స్టేషన్ సమీపంలోకి శరణ్య రాగానే  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. ఆమెను అడ్డగించి.. అత్యంత దారుణం కత్తులతో పొడిచారు. అనంతరం రాళ్లతో కొట్టి.. చంపినట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహం రైల్వే ట్రాక్ పక్కనే పడి ఉంది. సమాచారం అందుకున్న డీసీపీ సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక శరణ్య భర్త సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే.. వాళ్ల ఇద్దరి మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు విచారణను ఆ కోణం నుంచి ప్రారంభించినట్లు సమాచారం. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్ళిన దుండగులు!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet