iDreamPost
android-app
ios-app

నారా లోకేష్ మీద కుట్ర జరుగుతుందట …!

నారా లోకేష్ మీద కుట్ర జరుగుతుందట …!

రాజకీయాల్లో స్వామి భక్తి సర్వ సాధారణం. తమ అధినేతలపై పలువురు విపరీతమైన స్వామి భక్తి చూపిస్తారు. అవి చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటాయి కానీ రాజకీయాల్లో ఇలాంటి లేకపోతే రాణించడం కష్టం. అధినేతలు కూడా అలాంటి స్వామి భక్తినే కోరుకుంటారు. వీరూ రెచ్చిపోతారు. ఈ కోవకే చెందుతారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. తమ నాయకులు చంద్రబాబు, లోకేష్‌లపై ఎనలేని భక్తిని చూపిస్తుంటారు. ఆయన భక్తి చూస్తే నవ్వొస్తుంటుంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ఏకంగా శాష్టాంగ నమస్కారం చేశారు. అంతేకాదు నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ చంద్రబాబుకు వినతిప్రతం ఇవ్వడం లాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో బుద్ధా వెంకన్న చేశారు.

చంద్రబాబు, నారా లోకేష్‌లపై స్వామి భక్తి చాటుకునే క్రమంలో బుద్ధా వెంకన్న హాస్యాస్పదమైన, అర్ధరహితమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నారా లోకేష్‌ను అంతం చేయాలనుకుంటున్నారంటూ వెంకన్న చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ను అంతం చేస్తే.. ఇక తమకు ఇబ్బంది ఉండదని అధికార పార్టీ అనుకుంటున్నట్లుగా ఉందని వెంకన్న అర్థంలేని ఆరోపణలు చేశారు.

వెంకన్న వ్యాఖ్యలు గమనిస్తే.. నారా లోకేష్‌ అంటే అధికార వైసీపీ హడలెత్తిపోతోందనేలా ఉన్నాయి. లోకేష్‌ను రాజకీయంగా ఎదుర్కొలేమని వైసీపీ భావించినట్లు, రాజకీయంగా లోకేష్‌ బలవంతుడు అనే అర్థం వచ్చేలా బుద్ధా వెంకన్న ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి జాకీలు వేసి లేపాలని చూసినా.. నారా లోకేష్‌ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందే. జూనియర్‌ ఎన్టీఆర్‌ నాయకత్వం వహించాలని టీడీపీలోనే డిమాండ్లు వినిపిస్తుండడం లోకేష్‌ బలం ఎంతో చెబుతోంది.

వెంకన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది మార్చిలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు విశాఖలో స్థానికులు నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పర్యటనకు వెళ్లిన నారా లోకేష్‌ను పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ రెండు పరిణామాలను ఆధారంగా చేసుకున్న బుద్ధా వెంకన్న.. చంద్రబాబు. లోకేష్‌లను అంతం చేయాలనుకుంటున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే వ్యాఖ్యలు చేశారు.

గతంలో లోకేష్‌ బయటకు వచ్చిన సమయంలో.. ప్రజలు నిరసన తెలిపారు. దాన్ని బట్టి వెంకన్న తమ యువనేత పట్ల ఆందోళన వ్యక్తం చేశారని భావించొచ్చు. కానీ ఇప్పుడు లోకేష్‌ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచే జూమ్‌ రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఏం జరిగిందని వెంకన్న ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నది ఆయనకే తెలియాలి.

Also Read : రాజకీయాలకు కిడారి శ్రావణ్ సెలవు!