Idream media
Idream media
వాస్తవాలతో సంబంధం లేకుండా తన స్థాయికి మరచి ఇతరులపై విమర్శలు, ఆరోపణలు చేయడంలో ముందుండే టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి నోరుపారేసుకున్నారు. అధికారంలో ఉండగా బెజవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను నడిపి, చంద్రబాబు అండతో బయటపడిన ఆయన సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు∙ఎదుర్కొంటున్నా తన తీరు మార్చుకోవడం లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అనేక చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ట్విట్టర్‌లో అనాలోచిత ఆరోపణలు చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ బయటకు రాకుండా తాడేపల్లిలోని ఇంట్లో దాక్కున్నారు. కరోనా వచ్చి వృద్దులు చనిపోయినా పర్వాలేదు పెన్షన్ డబ్బులు మిగులుతాయి అనే క్రూరమైన మనస్థత్వం జగన్‌గారిది’ అంటూ బుద్దా వెంకన్న దుర్మార్గమైన విమర్శలు చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
రాష్ట్రంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ, తగిన ఆదేశాలు జారీ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చురుగ్గా వ్యవహరిస్తున్న విషయం కనపడడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరూ ఇబ్బందులు పడకుండా ఇప్పటికే రేషన్ సరుకుల పంపిణీతోపాటు వలంటీర్ల ద్వారా ఏప్రిల్ 1వ తారీఖునే లబ్ధిదారులందరికీ పింఛన్లు అందించిన విధానాన్ని చూసి కూడా బుద్దా వెంకన్న తప్పుడు విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా పరిస్థితి తెలియగానే ఏపీ నుంచి మకాం ఎత్తేసి హైదరాబాద్‌కు వెళ్లిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం కష్ట కాలంలో ఉన్నప్పుడు సహాయంగా ఉండాల్సిన సమయంలో పత్తా లేకుండా పోయిన వారి గురించి మాట్లాడుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.
ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్లలో రౌడీయిజం చూపడానికి వెళ్లి.. అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయడంతో బుద్దా వెంకన్న పారిపోయిన వచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంబద్ధ పిటిషన్ వేయడంతో న్యాయమూర్తి చీవాట్లు కూడా పెట్టారు. అయినా సరే బుద్దా వెంకన్న తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఇంట్లో కూర్చొని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ నాయకులపై ట్విట్టర్‌లో విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
ఎన్నికల తర్వాత బుద్ధా వెంకన్నపై సొంత పార్టీ నేత, టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు.. గుళ్ళో కొబ్బరిచిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి,కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదుఅంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. అలాగే ట్వీట్ కూడా చేశారు.
ఇలాంటి క్యారెక్టర్ ఉన్న బుద్దా వెంకన్న ప్రభుత్వంపై అసంబద్ధ ఆరోపణలు చేయడం మానుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.