బ్రహ్మాస్త్ర మీద కంగనా ఘాటు కామెంట్లు

నిన్న విడుదలైన ఈ విజువల్ గ్రాండియర్ టాక్ ఏమంత గొప్పగా లేనప్పటికీ పబ్లిసిటీ పుణ్యమాని భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది.

నిన్న విడుదలైన ఈ విజువల్ గ్రాండియర్ టాక్ ఏమంత గొప్పగా లేనప్పటికీ పబ్లిసిటీ పుణ్యమాని భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది.

సినిమాల కన్నా ఎక్కువగా వివాదాలతో పాపులరయ్యే కంగనా రౌనత్ తాజాగా బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివను టార్గెట్ చేసింది. నిన్న విడుదలైన ఈ విజువల్ గ్రాండియర్ టాక్ ఏమంత గొప్పగా లేనప్పటికీ పబ్లిసిటీ పుణ్యమాని భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ధూమ్ 3 లాంటి చిత్రాల పేరు మీదున్న రికార్డును దాటేసి ఆరు కోట్లకు పైగా వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ భారీ వసూళ్లు ఇస్తున్నారు. వీకెండ్ సహజంగాన్ రన్ బాగుంటుంది కాబట్టి దాని మీద అనుమానం లేదు కానీ సోమవారం నుంచి ఇదే ఊపు కొనసాగిస్తే అప్పుడు బ్లాక్ బస్టరని చెప్పొచ్చు. మొత్తానికి టాక్ కి భిన్నంగా వసూళ్ల పర్వం కొనసాగడం గమనార్హం.

ఇక కంగనా విషయానికి వస్తే దర్శకుడు అయాన్ ముఖర్జీ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. 12 ఏళ్ళ పాటు సినిమా తీసి ఈ కాలక్రమంలో 14 కెమెరా మెన్లను మార్చాడని, 400 రోజులకు పైగా చిత్రీకరణ జరిపి 85 అసిస్టెంట్ డైరెక్టర్లను తీసేస్తూ పోయాడని ఘాటు కామెంట్లు చేసింది. 600 కోట్ల రూపాయలు బూడిద కావడానికి కారణమయ్యాడని విరుచుకు పడింది. ఇదంతా తన ఇన్స్ టాలో పోస్ట్ చేసింది. వెంటనే జైల్లో పెట్టాలని డిమాండ్ చేసింది. ఒక నెగటివ్ రివ్యూ తాలూకు స్క్రీన్ షాట్ ను కూడా పంచుకుంది. దీని వల్ల ఇండియాలో ఫాక్స్ స్టూడియో ఆస్తులు అమ్మేసుకోవాలని, ప్రమోషన్లలో కరణ్ జోహార్ నడిపించిన మాఫియా గురించి ప్రశ్నించింది.

మొత్తానికి కంగనా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి బ్రహ్మాస్త్ర మీద బాహుబలి రేంజ్ లో అంచనాలున్నాయి. కానీ రాజమౌళి పండించే ఎమోషన్స్ లో సగం కూడా అయాన్ ముఖర్జీ అందుకోలేకపోయారు. పైగా విఎఫ్ఎక్స్ హడావిడి చాలానే ఉన్నప్పటికీ మరీ హై స్టాండర్డ్ నెవర్ బిఫోర్ అనేలా లేవని కొందరి కంప్లయింట్. అలియా రన్బీర్ ల కెమిస్ట్రీ పండినంతగా సినిమాలో కంటెంట్ లేదనే కామెంట్ లో వాస్తవం లేకపోలేదు. పార్ట్ 2 దేవ్ కు బజ్ ప్లస్ బిజినెస్ రావాలంటే ఇప్పుడీ మొదటి భాగం ఇండస్ట్రీ రికార్డులు సాధించాలి. లేదంటే దీని నష్టాల రికవరీ కోసం బయ్యర్లు సీక్వెల్ ని తక్కువ రేట్ కి అడుగుతారు. ఫైనల్ గా కంగనా ఇక్కడితో ఆగే బాపతు కాదు. చూద్దాం

Show comments