iDreamPost
android-app
ios-app

రాముడి పాత్ర కోసం రణ్ బీర్ కపూర్ ఇంత కష్టపడ్డాడా? 7 నెలల పాటు..

  • Published Jul 27, 2024 | 10:09 PM Updated Updated Jul 27, 2024 | 10:09 PM

Ranbir Kapoor Comments Preparation For Lord Rama: రామాయణం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఆ మూవీలో రాముడిగా రణ్ బీర్ కపూర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాత్రకు సంబంధించి రణ్ బీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Ranbir Kapoor Comments Preparation For Lord Rama: రామాయణం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఆ మూవీలో రాముడిగా రణ్ బీర్ కపూర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాత్రకు సంబంధించి రణ్ బీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Jul 27, 2024 | 10:09 PMUpdated Jul 27, 2024 | 10:09 PM
రాముడి పాత్ర కోసం రణ్ బీర్ కపూర్ ఇంత కష్టపడ్డాడా? 7 నెలల పాటు..

రణ్ బీర్ కపూర్ కు సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ మూవీతో రణ్ బీర్ ని కూడా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ఇది ఒక రకంగా రణ్ బీర్ కు చాలా మంచి చేసింది. ఎందుకంటే తన తర్వాతి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యేందుకు బిగ్ స్టెప్ అయ్యింది. రణ్ బీర్ కపూర్ తర్వాత రామాయణంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి చాలానే వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. కానీ, మొదటిసారి రణ్ బీర్ కపూర్ ఈ మూవీకి సంబంధించి రియాక్ట్ అయ్యాడు. తాను చేస్తున్న రాముడి పాత్ర కోసం ఎంత కష్టపడుతున్నాడో చెప్పుకొచ్చాడు.

రామాయణం సినిమా కోసం పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు రామాయణం అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి. అలాంటి రామాయణం సినిమా కాస్ట్ చూస్తే పిచ్చెక్కిపోతారు. రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి అని ఇప్పటికే కొన్ని స్టిల్స్ కూడా లీక్ అయ్యాయి. అలాగే రావణాసురిడిగా యష్ అంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని యష్ కూడా కన్ఫామ్ చేశాడు. చాలా నిజాయతీగా రామాయణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్న విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు రణ్ బీర్ కపూర్ కూడా తన పాత్రకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రాముడిగా రణ్ బీర్ కపూర్ ఎంపిక ఎంతో కరెక్ట్ అంటూ ఇప్పటికే విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఎందుకంటే ఎంతో విలక్షణమైన నటన రణ్ బీర్ కూపర్ సొంతం. అయితే అంతడి యాక్టర్ కి కూడా రాముడి పాత్ర ఎంతో ఛాలెంజింగ్ గా ఉన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను రాముడి పాత్ర కోసం దాదాపుగా 7 నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్న విషయాన్ని రణ్ బీర్ కపూర్ రివీల్ చేశాడు. తాను రోజుకు ఏకంగా 3 గంటల పాటు ఈ పాత్ర కోసం కృషి చేస్తున్నట్లు చెప్పాడు. ఇలా తనని తాను రాముడి పాత్ర కోసం సమాయత్తం చేసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అంటే తనని తాను మానసికంగా.. శారీరకంగా రాముడి పాత్ర కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఏదో అలా వచ్చి ఇలా చేసి వెళ్లిపోయే పాత్ర కాదు అని రణ్ బీర్ కపూర్ కి కూడా క్లారిటీ ఉంది. అందుకే ఇంత కష్టపడుతున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించి అప్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో చూడాలి మరి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom