iDreamPost
android-app
ios-app

ఆ భయంతోనే బ్రాహ్మణిని పక్కన పెట్టారా?

ఆ భయంతోనే బ్రాహ్మణిని పక్కన పెట్టారా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  చంద్రబాబు జైల్లో ఉండగా టీడీపీ మొత్తం గందరగోళంలో పడిపోయింది. ఇలాంటి సమయంలో నారా బ్రాహ్మణి పార్టీకి అండగా నిలబడుతుందని తెలుగు తమ్ముళ్లు భావించారు. వారి అంచనాలకు తగ్గట్లే బ్రాహ్మణి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఆ పార్టీ కార్యక్రమాల్లో బ్రాహ్మణి యాక్టివ్ గా లేరు. ఆమె పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తే.. లోకేష్ కి నష్టం జరుగుతుందనే భయంతో ఆమెను పక్కన పెట్టినట్లు పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

చంద్రబాబు అరెస్టైన నేపథ్యంలో టీడీపీకి బ్రాహ్మణి నాయకత్వం వహిస్తారని ఆ పార్టీ నేతలు, కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయి. చంద్రబాబు కేసులు చూసుకునేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లి.. మూడు వారాల పాటు  అక్కడే ఉన్నారు. లోకేష్ కేసులకు భయపడ్డారనే ప్రచారం కూడా  జరిగింది. మామ జైల్లో, భర్త ఢిల్లీలో  ఉండగా ఏపీ  రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన చేపట్టిన వివిధ  కార్యక్రమాలను ఆమె ముందుండి నడిపించారు. ఆమె ప్రసంగానికి తెలుగు తమ్ముళ్లు సైతం ఫిదా అయ్యారు. ఇక తమ నాయకుడు బయటకు వచ్చే వరకు నారా బ్రాహ్మణి పార్టీని చూసుకుంటారని టీడీపీ శ్రేణులు భావించాయి. తాజాగా బ్రాహ్మణిని పక్కన పెట్టేశారని టాక్ వినిపిస్తోంది. భువనేశ్వరి, లోకేష్ మాత్రమే జనంలోకి వెళ్తున్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమం పేరుతో నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తుండగా.. చంద్రబాబు మధ్యలో ఆపేసిన ‘భవిష్యత్ గ్యారెంటీ’ యాత్రను లోకేష్ చేపట్టనున్నారు. ఇలా తల్లీకొడుకులు చెరో కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ నారా బ్రాహ్మణి మాత్రం పట్టించుకోలేదనే టాక్ వినిపిస్తోంది. 

ఇటీవల ఢిల్లీలో లోకేష్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో తన భార్య బ్రాహ్మణికి రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పిన విషయం తెలిసిందే.  ఇదంతా లోకేష్ వ్యూహం ప్రకారమే చేశారని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. రాజకీయాల్లోకి నారా బ్రహ్మణి వస్తే.. లోకేష్ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే  బ్రాహ్మణిని రాజకీయాలకు దూరంగా పెట్టడమే మంచిదని.. ఆ రకంగా చేశారని అంటున్నారు. రాజకీయాల్లోకి మహిళలు రావాలని పిలుపునిచ్చే నారా లోకేష్.. సొంత కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేసరికి మరోలా ఉండటం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది.

అదే విధంగా నందమూరి బాలకృష్ణను కూడా  దూరం పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు అయిన కొత్తలో బాలయ్య కాస్తా హడావుడి చేశారు. ఆ తర్వాత చంద్రబాబుతో జరిగిన ములాఖత్ తో బాలయ్య ఏపీ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. కేవలం తెలంగాణ పాలిటిక్స్  చూసుకుంటున్నారు. ఇక్కడ కూడా చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కడ పార్టీ పగ్గాలు నారా నుంచి నందమూరి ఫ్యామిలీకి షిఫ్ట్ అవుతాయో అని బాలకృష్ణను దూరం పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.  ఇలా లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం నారా బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణలను ఏపీ రాజకీయాలకు దూరంగా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి.. నారా లోకేశ్ కోసం బ్రాహ్మణిని పక్కన పెట్టారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి