iDreamPost
android-app
ios-app

రూ. 410 కోట్ల బ్ర‌హ్మస్త్ర, ఆర్ఆర్ఆర్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌గ‌ల‌దా?

  • Published Sep 02, 2022 | 4:55 PM Updated Updated Jan 06, 2024 | 5:53 PM

బాక్సాఫీస్ వ‌ద్ద బాలీవుడ్ ప‌రువు ద‌క్కించేందుకు బ్రహ్మాస్త్రం రెడీ.

బాక్సాఫీస్ వ‌ద్ద బాలీవుడ్ ప‌రువు ద‌క్కించేందుకు బ్రహ్మాస్త్రం రెడీ.

రూ. 410 కోట్ల బ్ర‌హ్మస్త్ర, ఆర్ఆర్ఆర్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌గ‌ల‌దా?

రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌, నాగార్జుల సినిమా బ్ర‌హ్మాస్త్ర‌ సెప్టెంబర్ 9న విడుదలవుతోంది. ఈ సినిమాలో విఎఫ్‌ఎక్స్ డోస్ ఎక్కువ‌. సౌత్ లో ఈ మూవీ స‌క్సెస్ కోసం రాజ‌మౌళియే ద‌గ్గ‌రుంది ప్ర‌మోట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద బాలీవుడ్ ప‌రువు ద‌క్కించేందుకు బ్రహ్మాస్త్రం రెడీ.

అలియా భట్ – రణబీర్ కపూర్ ల నిజ జీవిత జంట స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఇదే మొదటిసారి. ఇది అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను పూర్తిచేయ‌డానికి నాలుగువంద‌ల కోట్లు ఖ‌ర్చు, నాలుగేళ్ల టైం ప‌ట్టింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా బాక్సాఫీస్‌పైనే ఉంది. అస‌లు నాలుగువంద‌ల కోట్ల‌కు మించిన బ‌డ్జెట్ ఎందుకైంది? స్టార్ కాస్ట్‌ల ఫీజులు ఎంతెంత‌?

రణబీర్ కపూర్ ఈ అడ్వెంచర్ ఫాంటసీ డ్రామా కోసం 20-25 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ప్ర‌పంచాన్నిర‌క్షించే శక్తులున్న ప్రధాన పాత్రను పోషించాడు. ట్రైలర్ లో ర‌ణ‌బీర్ కు మంచి మార్కులే పడ్డాయి. ట్రైల‌ర్ క‌న్నా సినిమాలోనే ఎక్కువ విఎఫ్‌ఎక్స్ ఎక్కువ క‌నిపిస్తాయ‌న్న‌ది బాలీవుడ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్న‌మాట‌. కొన్నిచోట్ల తెర అదిరిపోతుందంట‌. హిందూమ‌తం బ్యాక్ డ్రాప్ లో త‌యారైన ఈ సీనిమా, విఎఫ్‌ఎక్స్ క‌నుక మెప్పించ‌గ‌లిగితే సినిమా హిట్ అని అంటున్నారు.

రణబీర్ కపూర్ భార్య‌, ఆర్ఆర్ఆర్ లో క‌నిపించిన‌ అలియా భట్ బ్రహ్మాస్త్ర కోసం 10-రూ.12 కోట్లు వసూలు చేసింది. రణబీర్ ,అయాన్ ముఖర్జీతో మొద‌టి సినిమా ఇది. ఇప్ప‌టికే రణబీర్, అలియా కెమిస్ట్రీ కుర్రాళ్ల‌కు బాగా న‌చ్చింది.

సౌత్ సూపర్ స్టార్ నాగార్జున కూడా బ్రహ్మాస్త్ర చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ట్రైల‌ర్ లో మెరుపులా క‌నిపించే నాగార్జున సినిమాలో మాత్రం అర‌గంట‌సేపు ఉంటారంట‌. ఈసినిమాలో ఆయ‌న రెమ్యునిరేష‌న్ 9- 11 కోట్లు.

ఈ సినిమాలో షారుఖ్ ది ప్రత్యేక పాత్ర. వానరాస్త్ర పాత్రలో ఆయన క‌నిపిస్తున్నారు. ఈ సినిమాలో భాగమయ్యేందుకు కింగ్ ఖాన్ ఎంత చేశాడో ఇంకా తెలియరాలేదు. క‌మ‌ర్షియ‌ల్ గా కాకుండా, క‌ర‌ణ్ జోహార్ తో ఉన్న స్నేహంతో షారుఖ్ న‌టించ‌డాడు.

ముంబై స‌ర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ప్ర‌కారం, బాలీవుడ్‌లో ఇప్పటివరకు నిర్మించిన చిత్రాలలో బ్రహ్మాస్త్రా పార్ట్ 1 అత్యంత ఖరీదైన సినిమా. బడ్జెట్ దాదాపు 410 కోట్లు అని అంటున్నారు. ఈ బడ్జెట్‌లో ప్ర‌మోష‌న‌ల్ ఖ‌ర్చులు క‌ల‌ప‌లేదు. లేదంటే 450 కోట్ల‌కు చేరొచ్చు.

బ్రహ్మాస్త్ర సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌న గ్రాఫిక్స్. వీఎఫ్‌ఎక్స్‌ను ప్రైమ్ ఫోకస్ అనే సంస్థ తీర్చిదిద్దింది. ఈ భారతీయ కంపెనీ, 94వ అకాడమీ అవార్డ్స్‌లో డూన్ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆస్కార్ గెల్చుకుంది. సినిమా వీఎఫ్‌ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు రూ.75 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశారంట‌. ఈ లెక్క‌న బ్ర‌హ్మాస్త్ర 600 కోట్ల షేరు దాటితేకాని న‌ష్టాల నుంచి త‌ప్పించుకోలేదు.