iDreamPost
iDreamPost
రేపు సంక్రాంతి రేంజ్ లో శివరాత్రి పండగ హడావిడి బాక్సాఫీస్ వద్ద కనిపించనుంది. వందల కోట్ల స్టార్ హీరోల సినిమాలేవీ లేకపోయినా వస్తున్నవన్నీ దేనికవే ప్రత్యేకంగా కనిపిస్తుండటంతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. నెల క్రితం వచ్చిన ఉప్పెన తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా ఏదీ లేదు. కొన్ని లాభాలు ఇచ్చాయి కానీ మరీ గొప్పగా చెప్పుకునేలా ఏదీ అద్భుతాలు చేయలేకపోయింది. అందుకే బయ్యర్ల ఆశలన్నీ నాలుగు తెలుగు సినిమాలు, ఒక హిందీ మూవీ మీదే ఉన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓసారి వీటి స్టేటస్ ఎలా ఉందో చూద్దాం.
అన్నిటికంటే ఎక్కువ యూత్ నుంచి కామన్ ఆడియన్స్ దాకా అటెన్షన్ తీసుకున్న సినిమా జాతిరత్నాలు. ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికే 80 శాతం పైగా టికెట్లు సేల్ అయినట్టు తెలిసింది. ఒక్క హైదరాబాద్ లోనే కోటి రూపాయల దాకా ఇప్పటికే తన జేబులో వేసుకున్నట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇంకా రేపు ఉదయం దాకా టైం ఉంది. ఎన్ని వేల టికెట్లు అదనంగా యాడ్ అవుతాయో ఊహించలేం. ట్రైలర్, స్వప్న సినిమా చేసిన ప్రమోషన్లు మొత్తానికి జాతిరత్నాలు ఓపెనింగ్స్ ని భారీగా ఇవ్వబోతున్నాయి. ఇక శర్వానంద్ శ్రీకారం ఊహించని విధంగా రెండో స్థానంలో ఉంది. అందుతున్న సమాచారం మేరకు 50 శాతం మించి బుకింగ్స్ ఇప్పటికైతే కాలేదు.
టికెట్ ధరలు పెంచేయడం శ్రీకారం మీద బాగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, బి సెంటర్లో అదనంగా డబ్బులు ఇచ్చి మొదటిరోజే చూడాలా అనే అభిప్రాయం కామన్ ఆడియన్స్ లో ఉంది. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వస్తే సమస్య లేదు. మధ్యాన్నం నుంచే ఫుల్ పికప్ ఉంటుంది. ఇక శ్రీవిష్ణునే హీరో అయినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో చేసిన గాలి సంపత్ బుకింగ్స్ ప్రస్తుతానికి అంత ఆశాజనకంగా లేవు. ప్రివ్యూ నుంచి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్ పబ్లిక్ లోనూ కంటిన్యూ అయితే వేగం పెరగొచ్చు. ఇక కన్నడ డబ్బింగ్ రాబర్ట్ ని పట్టించుకునే నాథులు లేరు. జాన్వీ కపూర్ హిందీ మూవీ రూహీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.