Krishna Kowshik
Krishna Kowshik
టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. సీనియర్ ఎన్టీఆర్ నుండి ఆ తర్వాత తరం నటులతో కూడా హీరోయిన్‌గా నటించి మెప్పించిన ఏకైక నటి శ్రీదేవి అనొచ్చు. దక్షిణాది పరిశ్రమనే కాదూ.. హిందీ పరిశ్రమను ఏలిన మకుటం లేని మహారాణి. ఆమె నటనకు, అందానికి, మాటలకు మంత్ర ముగ్దులు అయ్యారు బాలీవుడ్ ప్రేక్షకులు. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చిన ఆమె.. బిజీయెస్ట్ ఆర్టిస్టుగా మారిపోయారు. అయితే తెలుగులో 1994లో చిరంజీవి ఎస్పీ పరుశురాం తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే 1996లో ఆమె తల్లి మరణించింది. అనంతరం బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుని సినిమాలకు కామా పెట్టింది. అదే సమయంలో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఆమె అప్పటికే ప్రెగ్నెంట్ అని కొంత మంది, జాన్వీకపూర్ పెళ్లికి ముందే పుట్టిందని వార్తలు వినిపించాయి.
15 ఏళ్ల విరామం తీసుకుని ఇంగ్లీష్, వింగ్లీషుతో మళ్లీ తెరపై కనిపించి కనువిందు చేసిన బ్యూటీ.. 2018లో దుబాయ్‌లో కన్నుమూసిన సంగతి విదితమే. అయితే పెళ్లికి సమయంలో ప్రెగ్నెంట్, జాన్వీ కపూర్ పుట్టడంపై క్లారిటీ ఇచ్చారు శ్రీదేవి భర్త బోనీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. వారి సీక్రెట్ వెడ్డింగ్ రివీల్ చేశారు. తాను 1996లో షిర్డీలో తాము రహస్య వివాహం చేసుకున్నామని, అయితే శ్రీదేవి ప్రెగ్నెంట్ కావడంతో తమ వివాహాన్ని జనవరిలో అందరికీ చెప్పామని తెలిపారు. పెళ్లికి ముందే జాన్వీ పుట్టిందన్న పుకార్లను ఆయన ఖండించారు. 1996 జూన్ 2న షిర్డీలో పెళ్లి చేసుకున్నామని, దండలు మార్చుకున్నామని, ఆరోజు అక్కడే గడిపామని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నారు.
అయితే జనవరిలో శ్రీదేవి గర్భం బయటకు కనిపించడంతో ఇక చెప్పేయాలని భావించినట్లు తెలిపారు. బహిరంగంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని 1997 జనవరిలో మరోసారి వివాహం చేసుకున్నామని చెప్పారు. అంతేకానీ పెళ్లికి ముందు జాన్వీ పుట్టలేదని చెప్పారు. శ్రీదేవి దేవుళ్లను బాగా విశ్వసిస్తుందని చెప్పారు. ప్రతి మూడు నెలలకొకసారి తిరుపతి వెళుతుందని, తన ప్రతి పుట్టిన రోజుకు ఆమె తిరుపతి నడుకుంటూ వెళ్లేదని, తాను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జుహు నుండి సిద్ది వినాకయ్ వరకు చెప్పులు లేకుండా నడిచి వెళ్లేదని తెలిపారు. కాగా, జాన్వీకి సోదరి ఖుషి కూడా ఉన్న సంగతి విదితమే.