iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో బాంబు పేలుడు కలకలం

హైదరాబాద్ లో బాంబు పేలుడు కలకలం

హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళ్తే ముషీరాబాద్ లో చెత్తకుండీలో బాంబు పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు..

ముషీరాబాద్ లో చెత్తకుండీలో ఉన్న బాక్స్ ను నాగయ్య అనే వ్యక్తి తీయడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో నాగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.. పేలుడు ధాటికి నాగయ్య చెయ్యి తెగిపడింది. వెంటనే బాంబు స్క్వాడ్, పోలీసు అధికారులు క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని పేలుడు సంభవించడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

ఎవరైనా కావాలనే చెత్తకుండీలో బాంబు పెట్టారా లేక ఈ పేలుడు వెనుక మరోకోణం ఏదైనా ఉందా అనే కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన నాగయ్యను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.. ఈ పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటామని స్థానికులు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.. ఈ సంఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişjojobet girişJOJOBET GİRİŞholiganbetjojobetjojobet girişgamdomgrandpashabet