iDreamPost
android-app
ios-app

మీ వల్లే నాకు పెళ్లి కావట్లేదు.. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు..

  • Published May 12, 2022 | 7:05 PM Updated Updated May 12, 2022 | 7:05 PM
  • Published May 12, 2022 | 7:05 PMUpdated May 12, 2022 | 7:05 PM
మీ వల్లే నాకు పెళ్లి కావట్లేదు.. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు..

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, క్వీన్ కంగనా రనౌత్‌ చాలా ఓపెన్ గా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది అన్న సంగతి తెలిసిందే. తనకి నచ్చకపోతే ఎవరి గురించైనా, దేని గురించైనా భయపడకుండా మాట్లాడేస్తుంది. తను ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కంగనా హోస్ట్ చేసిన కాంట్రవర్సీ షో లాకప్‌ ఇటీవలే పూర్తయింది. త్వరలో కంగనా ధాకడ్‌ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు నిజజీవితంలో కూడా టామ్‌ బాయ్‌ లాగే ఉంటారా అని అడిగారు.

దీనికి కంగనా రనౌత్.. నిజజీవితంలో నేను ఎవరిని కొట్టానో చూపించండి. మీ మీడియా వాళ్ళు ఇలాంటి పుకార్లు సృష్టించడం వల్లే నాకింకా పెళ్లి కావట్లేదు. మీరు ఇలా అనడం వల్లే నేను అందరితో గొడవ పెట్టుకుంటానేమో అని జనాలు అనుకుంటున్నారు అని తెలిపింది. తర్వాత సరదాగా నవ్వేయడంతో ఇవి సీరియస్ గా అన్న మాటలు కాదని అర్ధమవుతుంది. అయినా కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet