iDreamPost
iDreamPost
తెలుగునాట సంక్రాంతి సినిమాల సందడి ఒక రేంజ్ లో ఉంది. చాలా రోజుల తర్వాత అన్ని థియేటర్లు జనంతో కళకళలాడుతున్నాయి. మల్టీ ప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు అనే తేడా లేకుండా కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే దర్బార్, సరిలేరు నీకెవ్వరు వచ్చేసాయి. నెక్స్ట్ అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురాతో రేస్ పూర్తవుతుంది. టాక్స్ రిపోర్ట్స్ సంగతి పక్కనపెడితే ఈ మొదటి వారమంతా సెలవుల పుణ్యమాని కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా 10న మరో రెండు క్రేజీ హిందీ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ను పలకరించాయి. మొదటిది అజయ్ దేవగన్-సైఫ్ అలీ ఖాన్ ల పీరియాడిక్ డ్రామా తానాజీ. ఇది త్రిడిలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ. బాలీవుడ్ మీడియా రివ్యూస్ చాలా మటుకు పాజిటివ్ గానే వచ్చాయి. ఇక రెండోది దీపికా పదుకునే చపాక్. యాసిడ్ దాడి బాధితురాలిగా మొత్తం తన భుజస్కందాలపై మోసిన సినిమా ఇది. దీనికీ స్పందన బాగుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీటికి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. హిందీ సినిమాలు ఎక్కువ వేసుకునే మల్టీ ప్లెక్సులు సైతం డిమాండ్ కు తలొగ్గి తెలుగు మూవీస్ కే ఎక్కువ స్క్రీన్లు కేటాయించి సొమ్ములు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇంకో ఆరేడు రోజుల దాకా ఈజీగా కొనసాగుతుంది. ఆ తర్వాత స్టడీగా ఉండే సినిమాను ట్రూ బ్లాక్ బస్టర్ గా చెప్పుకోవచ్చు.
దీనికి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. గత ఏడాది అక్టోబర్ లో వార్ లాంటి హిందీ సినిమాల దెబ్బకు సైరా సైతం ఉత్తరాదిన ఘోరంగా దెబ్బ తింది. ఇప్పుడు దెబ్బకు దెబ్బ అనే తరహాలో మన సినిమాల స్ట్రోక్ కి తానాజీ, చపాక్ లు ఇక్కడ నెమ్మదిగా రన్ అవుతున్నాయి. ఈ రోజు సరిలేరు నీకెవ్వరు వల్ల చాలా చోట్ల వీటి స్క్రీన్ కౌంట్లో కూడా తేడా వచ్చేసింది. ఇక రేపు అల వైకుంఠపురములో వచ్చాక ఏం జరుగుతుందో వేరే చెప్పాలా.