iDreamPost
android-app
ios-app

వెండితెరపై ప్రపంచ కప్ మేజిక్

  • Published Jan 24, 2020 | 5:02 AM Updated Updated Jan 24, 2020 | 5:02 AM
వెండితెరపై ప్రపంచ కప్ మేజిక్

ఎన్ని కప్పులు గెలిచినా ఎన్ని సిరీస్ లు తీసుకొచ్చినా ఏ క్రికెట్ టీమ్ కైనా వరల్డ్ కప్ గెలిస్తే ఆ కిక్కే వేరు. అందుకే నాలుగేళ్లకోసారి జరిగే ఈ మహా క్రీడా సమరం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. ఉన్నత శ్రేణి జట్టుగా ముందునుంచి తన ఉనికిని చాటుకున్న ఇండియా ఇప్పటిదాకా వరల్డ్ కప్ ని గెలుచుకుంది రెండు సార్లే. ఇప్పటి తరానికి ధోని సారధ్యంలో 2011లో సాధించిన కప్ గుర్తుంటుంది. 

కానీ దానికన్నా ముందు 1983లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడం మాత్రం నిన్నటి జెనరేషన్ కు మాత్రమే తెలుసు. ఆ అనుభూతిని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు రెడీ అవుతోంది 83. రన్వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి స్టేజిలో ఉంది. అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో రన్వీర్ సింగ్ లుక్స్ ఇప్పటికే అందరికి షాక్ కి గురి చేశాయి. అచ్చం అదే తరహాలో ఉండే మేకప్ తో పాటు బాడీ లాంగ్వేజ్ ను కూడా మలుచుకున్న తీరుని చూసి అందరూ షాక్ తిన్నారు. 
భజరంగి భాయ్ జాన్ దర్శకుడు కబీర్ సింగ్ రూపొందించిన 83ని తెలుగు తమిళ భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. మనకు నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ పై విడుదల చేస్తుండగా కోలీవుడ్ లో కమల్ హాసన్ తన రాజ్ కమల్ బ్రాండ్ పై అందిస్తున్నారు. ఇలా ఇద్దరు సౌత్ దిగ్గజాలు 83కి అండగా నిలవడంతో మార్కెటింగ్ పరంగా చాలా పెద్ద ప్లస్ కానుంది. వచ్చే ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న 83ని వరల్డ్ వైడ్ చాలా భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఒకరకంగా ఇది కపిల్ దేవ్ బయోపిక్ అని చెప్పొచ్చు.