iDreamPost
android-app
ios-app

‘జై శ్రీరామ్’ నినాదాలపై ఉదయనిధి కామెంట్స్.. BJP స్ట్రాంగ్ కౌంటర్!

‘జై శ్రీరామ్’ నినాదాలపై ఉదయనిధి కామెంట్స్.. BJP స్ట్రాంగ్ కౌంటర్!

వరల్డ్ కప్-2023లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మధ్య  శనివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.  ఈ మ్యాచ్ జరిగిన క్రికెట్ స్టేడియం జై శ్రీరాం నినాదాలతో దద్దరిలింది.  అయితే జై శ్రీరామ్  అనే నినాదాలు చేయడాన్ని డీఎంకే నాయకుడు, తమినాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అయితే అతడి వ్యాఖ్యలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఉదయనిధిని విషాన్నిచిమ్మే దోమగా బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా అభివర్ణించాడు.

గుజరాత్‌లోని మోతేరా స్టేడియంలో భారత్‌-పాక్ మ్యాచ్‌ సందర్భంగా పాక్ క్రికెటర్ రిజ్వాన్ ఔటై.. పెవిలియన్ వెళ్తున్నాడు. ఇదే సమయంలో అతడి ముందు అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలపై తమిళనాడు క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్యను సహించరానిదిగా పేర్కొన్నారు ఉదయనిధి. క్రీడా వేదికగా ద్వేషాన్ని చిమ్ముతున్నారని ఉదయ్ నిధి మండిపడ్డారు. ఆటలు దేశాల మధ్య సోదరభావాన్ని పెంచాలని కోరారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఘాటుగా స్పందించింది.ఉదయనిధి చేసిన వ్యాఖ్యలే విద్వేషంతో కూడుకున్నవని బీజేపీ నేతలు మండిపడ్డారు.

క్రీడా మైదానంలో నమాజ్ చేయడానికి గేమ్ ను కాసేపు ఆపినప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం లేదా..? అంటూ ఉదయనిధిని ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా ప్రశ్నించారు. విశ్వంలో ప్రతి అణువునా రాముడు ఉంటాడని పేర్కొన్న గౌరవ్ భాటియా.. జై శ్రీ రాం అనాలని ఉదయనిధికి హితువు పలికారు.పాక్ క్రికెటర్ల సమక్షంలో జై శ్రీరాం నినాదాలకు సంబంధించిన వీడియోలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి.  మరి.. ఉదయనిధికి బీజేపీ నేతలు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి