iDreamPost
android-app
ios-app

దుబ్బాక పోరు : కొనసాగుతున్న బీజేపీ ఆధిక్యత..

  • Published Nov 10, 2020 | 5:52 AM Updated Updated Nov 10, 2020 | 5:52 AM
  • Published Nov 10, 2020 | 5:52 AMUpdated Nov 10, 2020 | 5:52 AM
దుబ్బాక పోరు : కొనసాగుతున్న బీజేపీ ఆధిక్యత..

తెలంగాణ రాష్ట్రం దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రారంభం నుంచి కొనసాగిస్తోంది. ఐదు రౌండ్‌లోనూ బీజేపీ 336 ఓట్ల ఆధిక్యం సాధించింది.

ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి 35,896 ఓట్లు లెక్కించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు 16,517 ఓట్లు సాధించారు. సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిన సోలిపేట సుజాత కన్నా రఘునందన్‌ రావు 3020 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఈ ఫలితాల్లో పేలవమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస రెడ్డి కేవలం 2,724 ఓట్లు మాత్రమే సాధించారు. కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఓట్లు.. బీజేపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కన్నా తక్కువగా ఉండడం విశేషం.

మొత్తం 23 రౌండ్లులో 1,64, 192 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఐదు రౌండ్లలో 35,896 ఓట్లు మాత్రమే లెక్కించారు. ఇంకా 18 రౌండ్లు మిగిలి ఉన్నాయి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet