iDreamPost
android-app
ios-app

ఈట‌ల రాక‌.. బీజేపీలో కాక‌..!

ఈట‌ల రాక‌.. బీజేపీలో కాక‌..!

ప్ర‌భుత్వం మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన అనంత‌రం తాను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్ర‌క‌టించిన‌ ఈటల రాజేందర్… తన నియోజకవర్గ ప్రజల దగ్గర వెళ్లి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్ర‌జ‌ల‌తో పాటు ప‌లు పార్టీల నాయ‌కుల‌ను కూడా ఆయ‌న వ‌రుస‌గా క‌లుస్తూ వ‌చ్చారు. ఇప్పుడు ఆయ‌న బీజేపీ వైపు అడుగులు వేస్తున్నార‌ని విప‌రీతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ బీజేపీ జాతీయ నేత సమక్షంలో భేటీ అయినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈటల బీజేపీలో చేరకుండానే ఆ పార్టీలో విభేదాలు భగ్గమన్నాయి. బీజేపీలో కొంద‌రు నేత‌లు ఈట‌ల పార్టీలో చేరిక‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

కొంత కాలంగా ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ రాజ‌కీయంగా న‌డుస్తూనే ఉంది. తాజాగా ఆయ‌న స్వ‌తంత్రంగానే పోటీ చేస్తాన‌ని స్వ‌యంగా చెప్పిన‌ప్ప‌టికీ.. ప‌లు స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో బీజేపీలో చేరేది ఖాయ‌మ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే ఈటల బీజేపీలో చేరబోతున్నట్టు వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి ఇనుగాల పెద్ది రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని ఆయన హెచ్చరించారు.

పెద్దిరెడ్డి మాట్లాడుతూ ‘నన్ను సంప్రదించకుండా ఈటల రాజేందర్ ను ఎట్లా బీజేపీలోకి తీసుకుంటారు? ఒక వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయనతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా నన్ను అడగలేదు’ అని పెద్ది రెడ్డి ఫైర్ అయ్యారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక వాహ‌నంలో వచ్చిన చర్చలు జరిపిన నాయకులు నాకు చెప్పడానికి ఏంటి బాధ అని పెద్ది రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లోని వవివేక్ ఫాంహౌస్ లో చర్చలు జరిపితే నేను గుర్తు లేదా? అని నిలదీశారు.ఈటలను పార్టీలోకి ఎలా తీసుకుంటారని.. నన్ను సంప్రదించుకుండా ఎలా ముందుకు వెళతారని పెద్ది రెడ్డి బీజేపీ పెద్దలను ప్రశ్నించారు. పెద్దిరెడ్డి అసమ్మతి గళంతో ఇప్పుడు బీజేపీలో ఈటల చేరిక వివాదం రాజుకుంటోంది. బీజేపీలో చేరిక ఖాయ‌మ‌ని మీడియాలో గుప్పుమన్నా ఈట‌ల నోరు మెదప‌లేదు. అది వాస్త‌వ‌మో, కాదో చెప్ప‌లేదు. మాజీ ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డి మాత్రం ఐక్య వేదిక కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని చెబుతున్నారు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితులు ఉన్నాయి. కానీ ఇంత‌లోనే బీజేపీలో ముస‌లం మొద‌ల‌వ‌డం గ‌మ‌నార్హం.