iDreamPost
android-app
ios-app

Badvel By Poll -బద్వేలు బై పోల్ : బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కావ‌లెను

Badvel By Poll -బద్వేలు బై పోల్ : బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కావ‌లెను

త‌గ్గేదేలే అంటూ బ‌ద్వేలు బ‌రిలో నిలిచిన బీజేపీకి ఆది నుంచీ అవాంత‌రాలే ఎదుర‌వుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో రెండు ల‌క్ష‌ల ఓట్ల‌లో క‌నీసం వెయ్యి ఓట్ల‌ను కూడా పొంద‌లేక‌పోయిన పార్టీ,ఈసారి గ‌ట్టిగా పోటీ ఇస్తామంటూ భారీ ప్ర‌క‌ట‌న‌లు ,మాటలు ప‌లికిన సోము వీర్రాజు దాన్ని నిల‌బెట్టుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. లేని బ‌లాన్ని నిరూపించుకోవ‌డానికి అప‌సోపాలు ప‌డుతున్నారు. ఇప్పుడు పోలింగ్ లో ఓట్లు సంపాదించ‌డం క‌న్నా.. అన్ని బూత్ ల‌కు పోలింగ్ ఏజెంట్ల ను సంపాదించ‌డ‌మే బీజేపీకి క‌ష్టంగా మారింది.

బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న కమలంపార్టీ విచిత్రమైన పరిస్ధితులు ఎదుర్కొంటోంది. పోలింగ్ లో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది ఇక్కడ పెద్ద విషయంకాదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లొచ్చాయనే విషయాన్ని గమనిస్తే జరగబోయే ఉపఎన్నికలో ఎన్ని ఓట్లొస్తాయనే విషయాన్ని అంచనా వేయొచ్చు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు 735 మాత్రమే. ఈ ఓట్లను బట్టిచూస్తే జరగబోయే పోలింగ్ లో మహా అయితే ఓ వంద ఓట్లు అటో ఇటో అని అంచనా వేసుకోవచ్చు. అయితే బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మాత్రం తాము బ్రహ్మాండాన్ని బద్దలు కొడతామన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు.

బీజేపీ నేతల్లో ఎవరేమి చెప్పినా, చెబుతున్నా అసలు విషయం ఏమిటనేది అందరికీ తెలిసిందే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఇపుడు బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకటంలేదట. నియోజకవర్గంలో సుమారు 200 పోలింగ్ కేంద్రాలున్నాయని అనుకుంటే 200 మంది పోలింగ్ ఏజెంట్లు ఉండాల్సిందే కదా. కానీ బీజేపీకి మాత్రం పట్టుమని 50 మంది కూడా పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటానికి ముందుకు రాలేద‌ని తెలుస్తోంది. పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటానికి ఎందుకు ముందుకు రావటంలేదంటే అంతమంది నేతలు లేరుకాబట్టే. పార్టీ సంస్ధాగతంగా బలోపేతం కాక‌పోవ‌డం, దేశీయంగా బీజేపీ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేక‌త‌తో ఏపీలో ప‌ట్టుకోల్పోతోంది.

ఉపఎన్నికలో పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేకపోతే భారీ అవ‌మానంగా భావిస్తున్న నేత‌లు పోలింగ్ తేదీ స‌మీపించే లోపు ఎలాగైనా వారిని సంపాదించాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. అందుకనే ఏదోరకంగా ఏజెంట్లను పెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ కార్యకర్తలను ఏజెంట్లుగా కూర్చోమని అడుగుతున్నారట. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అట్లూరు మండలంలోని గోపీనాధపురంలో కొందరు టీడీపీ నేతలను క‌లిసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీ తరపున పోలింగ్ రోజున ఏజెంట్లుగా కూర్చోమని రిక్వెస్టు చేశారట. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ సమక్షంలోనే టీడీపీ నేతలను పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోమని ఆదినారాయణరెడ్డి బతిమలాడుకోవటం విచిత్రంగా ఉంది. చిత్ర‌విచిత్రాలు ఎలాగున్నా.. ఎన్నిక‌ల తేదీలోగా అన్ని పోలింగ్ బూత్ ల‌లోను ఏజెంట్ల‌ను కూర్చోబెడితే అదే చాల‌న్న రీతిలో బీజేపీ ఉంది.

Also Read : TDP Merger – బీజేపీలో తెదేపా విలీనానికి ప్ర‌తిపాద‌న‌లా?