Idream media
Idream media
రాజ్యసభ ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు బిజెపి అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిఎం యడ్యూరప్ప, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్ కలిసి రమేశ్ కట్టి, ప్రకాశ్ శెట్టి, ప్రభాకర్ కోరే అన్న పేర్లను ఫైనల్ చేసి అధిష్ఠానానికి పంపారు. అయితే అధిష్ఠానం మాత్రం ముఖ్యమంత్రి యడ్యూరప్ప పంపిన పేర్లను పక్కన పెట్టేసి ఎవరూ ఊహించని విధంగా మరో ముగ్గురు పేర్లను ఫైనల్ చేస్తూ పంపింది. వారిలో ఎరన్న భీమప్ప కడ్డి, అశోక్ జాస్తి అన్న పేర్లను యడ్యూరప్పకు పంపింది. దీంతో యడ్యూరప్ప ఒక్కసారిగా ఖంగు తిన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర బిజెపిలో అత్యంత క్రియాశీలకంగా ఉండే అధికార ప్రతినిధి ప్రకాశ్ కూడా అధిష్ఠానం ఫైనల్ చేసిన జాబితాను చూసి ఖంగు తిన్నారు. అయితే కార్యక్షేత్రంలో బాగా పనిచేసిన వారిని అధిష్ఠానం గుర్తించిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అవును ఈ జాబితా ఖంగు తినిపించింది. కార్యక్షేత్రంలో పనిచేసే కార్యకర్తలను బిజెపి గుర్తించింది. వారికి తగిన బహుమానం అందించింది’’ అని వ్యాఖ్యానించారు.అయితే యడ్యూరప్ప సారథ్యంలో తుది రూపునిచ్చిన బృందంలో మంత్రి మాట్లాడుతూ… ‘‘తాము పందు’’అని పేర్కొన్నారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఈయనే కీలక పాత్ర
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బిజెపి జాతీయ సంఘటనా కార్యదర్శి బిఎల్ సంతోష్ ముఖ్య భూమిక పోషించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప, బిజెపి అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్ కలిసి రమేశ్ కట్టి, ప్రకాశ్ శెట్టి, ప్రభాకర్ కోరే అన్న పేర్లను ఫైనల్ చేస్తూ అధిష్ఠానానికి పంపించారు. అయితే వాటిని పక్కన పెట్టి…అధిష్ఠానం అశోక్ గస్తీ, ఎరన్న భీమప్ప కడ్డి అన్న కొత్త పేర్లను తెరపైకి తెచ్చి సిఎం యడ్యూరప్పకు పంపించారు. అయితే ఇలా క్షేత్ర స్థాయి కార్యకర్తలకు పెద్ద పీట వేడయంలో బిఎల్ సంతోశ్ కీలక పాత్ర పోషించారు. ఈ పేర్లే ఫైనల్ కావడంలో ఆయన పాత్ర కీలకమైనట్లు సమాచారం. వారి వారి కుల సమీకరణాలే కాకుండా…కార్యక్షేత్రంలో చాలా సమర్థతో పనిచేయడాన్ని గమనించిన సంతోశ్…వారినే తెరపైకి తీసుకొచ్చారు.
అశోక్ గస్తీ… వెనుకబడిన సవిత తరగతులకు చెందిన వారు కాగా, ఈరన్న కడాడి లింగాయత్ సామాజిక తరగతులకు చెందిన నేత. వీరిద్దరూ 30 ఏళ్లుగా బిజెపి పటిష్ఠత కోసం కార్యక్షేత్రంలో సైలెంట్‌గా పనిచేస్తున్నారు. అందులో ఒకరు తాలూకా అధ్యక్షులు కాగా, మరోకరు జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నవారు. వారి పనితీరు, ప్రచారానికి పాకులాడక పోవడం లాంటి అంశాలే వారిని ఏకంగా పెద్దల సభకు పంపేలా చేశాయని ఓ నేత పేర్కొన్నారు.
కార్యక్షేత్రంలో పనిచేస్తూ… ఏమాత్రం ప్రచార ఆర్భాటాల కోసం ఎగబడని నేతల సమర్థతను పసిగట్టడంలో దిట్ట అని బిఎల్ సంతోశ్‌కు ముందు నుంచీ పేరుంది. ప్రస్తుతం బెంగళూరు ఎంపిగా ఉన్న తేజస్వీ సూర్య, మరో ఎంపి ప్రతాప్ సింహ… వీరిద్దర్నీ గుర్తించి, పైకి తెచ్చిందే కూడా ఈయనే. అంతేకాకుండా ఈయన ఓ టాస్క్ మాస్టర్ అని, పార్టీ కోసం, ప్రజల కోసం కష్టించి, ప్రచార ఆర్భాటాలు లేకుండా పనిచేసే వారిని ఈయనే ఇట్టే పసిగట్టి, చాలా ప్రోత్సహిస్తారని కూడా అటు సంఘ్, ఇటు బిజెపి సర్కిల్‌లో ఈయనకు పేరుంది.
కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ప్రస్తుతం ఉన్న బలాబలాను బట్టీ బిజెపికి రెండు, కాంగ్రెస్‌కు ఒకటి వస్తుంది. ఇంకొకటి జెడిఎస్ అవకాశం లభించింది. కాంగ్రెస్ మద్దతుతో మాజీ ప్రధాని హెచ్‌డి. దేవగౌడ బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే పోటీ చేస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో జెడిఎస్ తరపున బరిలోకి దిగిన దేవగౌడ, కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన మల్లిఖార్జున ఖర్గే ఓటమి చెందారు. ఏడాది తరువాత వారిద్దరు రాజ్యసభకు వస్తున్నారు.