iDreamPost
android-app
ios-app

Bipin Rawat – సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

Bipin Rawat – సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

తమిళనాడులోని ఊటిలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)  బిపిన్‌ రావత్‌ దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారికంగా ప్రకటించింది.

Also Read: కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. అందులో త్రివిధ దళాల అధిపతి బిపిన్‌

ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ సతీమణితోపాటు మరో 11 మంది సైనిక సిబ్బంది చనిపోయారని పేర్కొంది. పొగ మంచు వల్ల వెలుతురు సరిగా లేని కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపింది. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ తీవ్ర గాయాలతో విల్లింగ్‌టన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.

హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణించారని నీలగిరి కలెక్టర్‌ వెల్లడించారు. అందులో 13 మంది చనిపోయారని తెలిపారు. మంటల వల్ల గుర్తుపట్టలేనంతగా శరీరాలు కాలిపోయాయన్నారు. మృత దేహాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తామని తెలిపారు.

బిపిన్‌ రావత్‌ మృతిపై దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. బిపిన్‌ మరణం దేశానికి తీరని లోటని అభివర్ణించారు.

Also Read:హెలికాప్టర్‌ ప్రమాదం : ముందే దూకేసిన బిపిన్‌.. మిగతా వారందరూ దుర్మరణం

బిపిన్‌ రావత్‌ ఉత్తరాఖండ్‌లో 1958 మార్చి 16వ తేదీన జన్మించారు. ఆయన పూర్తి పేరు బిపిన్‌ లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌. బిపిన్‌ తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ జనరల్‌గా పని చేశారు. 1978లో ఆర్మీలో చేరిన బిపిన్, వివిధ హోదాల్లో పని చేశారు. 2016 డిసెంబర్‌ 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా ఎన్నియ్యారు. 2019 డిసెంబర్‌ 31వ తేదీన పదవీ విరమణ చేశారు. ఆ మరుసటి రోజునే కొత్తగా సృష్టించిన త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్‌)గా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల బిపిన్‌ పదవీ కాలం రాబోయే జనవరి 1వ తేదీన ముగియనున్న నేపథ్యంలో.. ఈ రోజు దుర్మరణం పాలయ్యారు.