iDreamPost
android-app
ios-app

మరో బీహార్ మంత్రిని కాటేసిన కరోనా..

మరో బీహార్ మంత్రిని కాటేసిన కరోనా..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆ రాష్ట్ర మంత్రులు కరోనా కాటుకు బలవుతున్నారు. అక్టోబర్12 న బీహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ మరణించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోపే మరో బీహార్ మంత్రి కరోనాకి బలయ్యారు.

వివరాల్లోకి వెళితే జనతాదళ్‌ (యునైటెడ్‌) సీనియర్‌ నేత, బిహార్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కపిల్‌ డియో కామత్‌ (69) కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా సోకిన కారణంగా పాట్నాలోని ఎయిమ్స్‌ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం బిజెపి ఎమ్మెల్యే వినోద్ కుమార్ సింగ్ కరోనా తగ్గిన అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల్లోపే కపిల్ డియో కామత్ మరణించడంతో ఆ రాష్ట్ర నాయకులు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు..

బీహార్ రాష్ట్ర సీనియర్ నేత కపిల్ డియో కామత్ మరణించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మంత్రి మరణవార్త తెలిసి బీహార్ శాసనమండలి యాక్టింగ్ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్, బీహార్ బిజెపి చీఫ్ సంజయ్ జైస్వాల్, వ్యవసాయ మంత్రి ప్రేమ్ కుమార్, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి నీరజ్ కుమార్ లు సంతాపం తెలిపారు.