iDreamPost
iDreamPost
అదేంటో బిగ్ బాస్ 4 షో పూర్తయ్యాక విజేత కాకుండా మిగిలినవాళ్ల కెరీర్లు స్పీడ్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అఖిల్, సోహైల్ హీరోలుగా ఇప్పటికే విడివిడిగా సినిమాలు మొదలయ్యాయి. అవి హిట్ అవుతాయా లేదా ఈ ఇద్దరికీ ఎన్ని ఆఫర్లు వస్తాయనేది అప్రస్తుతం కానీ మొత్తానికి ఎర్లీగా ఛాన్స్ కొట్టేసింది మాత్రం వీళ్ళే. అయితే విన్నర్ అభిజిత్ మాత్రం ఇప్పటిదాకా సైలెంట్ గానే ఉండాల్సి వచ్చింది. హౌస్ లో యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అందరి కంటే సీనియర్ అయినప్పటికీ నిర్మాతలు అంత ఈజీగా ఇతని వద్దకు రాలేదు. కారణాలు ఏమైనప్పటికీ ఫైనల్ గా హోస్ట్ నాగార్జున వల్లే ఇతని కెరీర్ లో కదలిక వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్.
అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో కోర్సు పూర్తి చేసుకుని ట్రయిల్స్ లో ఉన్న వాళ్ళతో అభిజిత్ హీరోగా లేదా ప్రధాన పాత్రలో మూడు సినిమాలు తీసేందుకు నాగార్జున రెడీ అయినట్టుగా సమాచారం. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందంటున్నారు కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ ఖచ్చితంగా చెప్పలేం. చర్చలు జరిగి కథలు విన్న మాట మాత్రం వాస్తవం. చాలా ఏళ్ళ క్రితమే సిల్వర్ స్క్రీన్ డెబ్యూ చేసిన అభిజిత్ కు టైం కలిసి రాలేదు. చేసిన కొన్ని సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. శేఖర్ కమ్ముల అంతటి దర్శకుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తీసినా ఫలితం లేకపోయింది.
సో అభిజిత్ ని మరోసారి తెరమీద చూడటం ఖాయమైనట్టే. అయితే నాగ్ ఒకటి కాకుండా ఏకంగా మూడు సినిమాలకు ప్లాన్ చేయడం ఆశ్చర్యం కలిగించే పరిణామం. ఎంత విన్నర్ అయినా అభిజిత్ కు యూత్ లో పడిచచ్చిపోయేంత ఫాలోయింగ్ కానీ టీవీ ఆడియన్స్ లో విపరీతమైన ప్రేమాభిమానాలు కానీ పెద్దగా లేవు. బిగ్ బాస్ సిరీస్ అనేదే సీజనల్ పాపులారిటీ మీద ఆధారపడి నడుస్తుంది. అలాంటిది అభిజిత్ ని ఇలా సోలో హీరోగా చూపడం సాహసమే. అయినా కంటెంట్ బలంగా ఉంటే హీరో ఎవరనేది పెద్దగా పట్టించుకోని ట్రెండ్ లో ఏ పుట్టలో ఏ పాముందన్న తరహాలో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుందేమో చూద్దాం