iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: ప్రియాంకపై భోలే చిందులు.. చాలా మందిని చూశానంటూ..!

Bigg Boss 7 Telugu: ప్రియాంకపై భోలే చిందులు.. చాలా మందిని చూశానంటూ..!

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్స్ హీట్ ఉంటూనే ఉంటుంది. ఈసారి కూడా నామినేషన్స్ సోమవారం పూర్తి కాలేదు. మంగళవారానికి కూడా ఆ హీట్ కంటిన్యూ అవుతోంది. సోమవారం కేవలం ఏడుగురు మాత్రం నామేనషన్స్ లో పాల్గొన్నారు వారిలో ప్రశాంత్- సందీప్, తేజ.. అమర్ దీప్- భోలే, అశ్విని.. పూజామూర్తి- భోలే, అశ్విని.. సందీప్- భోలే, ప్రశాంత్.. అర్జున్- భోలే, అశ్విని.. ప్రియాంక్- భోలే, అశ్విని.. తేజ- పూజా, ప్రశాంత్ లను నామినేట్ చేశారు. అయితే ఈ నామినేషన్స్ లో చాలానే గొడవలు జరిగాయి. ముఖ్యంగా సందీప్- ప్రశాంత్ ల మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు అంతకు మించి ప్రియాంక- భోలే మధ్య గొడవైంది.

హౌస్ లోకి వచ్చిన వైల్ట్ కార్డు ఎంట్రీల్లో భోలే షావలీపై అందరికీ నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఆట అసలు ఆడటం లేదని, అసలు ఏ ఎయిమ్ లేకుండా కేవలం నవ్వుతూ, నవ్విస్తూ ఉందాం అని మాత్రమే వచ్చాడు అంటూ హౌస్ మేట్స్ కామెంట్ చేస్తున్నారు. హోస్ట్ ట్యాగ్ ఇవ్వండి అని చెప్పినప్పుడు కూడా భోలేకి ఎయిమ్ లెస్ అనే ఎక్కువ వచ్చాయి. అంతేకాకుండా హౌస్ లో కేవలం భజన చేస్తూ గడిపేయచ్చు అనే ఆలచనలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. నామినేషన్స్ లోకి వచ్చే సరికి మాత్రం భోలే షావలి విశ్వరూపం చూపించాడు. అర్థం లేకుండా మాట్లాడటం, వికృత చేష్టలు చేయడం, మధ్యలో బూతులు మాట్లాడటం కూడా చేశాడు.

నామినేషన్స్ లో భోలే షావలీకి ఎక్కువ ఓట్లే పడ్డాయి. అయితే అర్జున్, అమర్ దీప్ నామినేట్ చేసినప్పుడు రియాక్ట్ కాని భోలే.. ప్రియాంక విషయంలో మాత్రం రెచ్చిపోయాడు. అలాగే శోభా నామినేట్ చేసినప్పుడు కూడా భోలే కొన్ని కామెంట్స్ చేశాడు. అప్పుడు ప్రియాంక గురించి కూడా కామెంట్ చేశాడు. ఆడపిల్లలు మంచి భవిష్యత్ ఉంది మీకు అన్నాడు. అందుకు ప్రియాంక ఫుల్ ఫైర్ అయిపోయింది. ఆడపిల్ల ఆడపిల్ల నటించావుగా ఇంతసేపు కనిపిస్తోంది అంటూ ప్రియాంక కామెంట్ చేసింది. తర్వాత భోలే నీలాంటి వాళ్లను చాలామందిని చూశాను అంటూ ప్రియాంకను రెచ్చగొట్టాడు. ఆ మాటతో ప్రియాంక ఫుల్ ఫైర్ అయిపోయింది. నేను ఇవన్నీ తీసుకోను అంటూ కేకలు వేసింది. మాటల గ్యాప్ లో భోలే షావలి బూతులు కూడా మాట్లాడాడు.

భోలే బూతులకు శోభాశెట్టి ఫైర్ అయింది. పక్కన ఆడపిల్లలు ఉంటే నోరు అదుపులో పెట్టుకో అంటూ వేలు చూపిస్తూ కేకలు వేసింది. ప్రియాంక ఆగ్రహంతో తూ అంటూ వెళ్లిపోయింది. అందుకు భోలే నేను కూడా తూ అంటే నీ బతుకు ఏం కావాలి అంటూ ప్రశ్నించాడు. ఇది మొత్తం ప్రోమోలో బాగా హైలెట్ అయిన విషయం. అయితే ఇక్కడ భోలే- ప్రియాంకలో ఎవరి తప్పు ఉంది అంటే.. భోలేదే అని చెప్పాలి. ఎందుకంటే భోలే ఆట విషయంలో బయట కూడా నెగిటివిటీ ఉంది. అసలు ఏం ఆడట్లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు బగ్ బాస్ హౌస్ లో కచ్చితంగా నామినేట్ చేస్తారు. అదే హౌస్ మేట్స్ కూడా చేశారు. అందుకు ప్రియాంకపై భోలే నోటికొచ్చినట్లు మాట్లాడటం, నీలాంటి వాళ్లను చాలామందినే చూశాను అనడం కరెక్ట్ కాదు. పైగా ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షోలో బూతులు మాట్లాడటం కూడా అంత మంచిగా అనిపించడం లేదు. ఈ వివాదంపై హోస్ట్ నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. మరి.. ప్రియాంక- భోలే మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి