iDreamPost
iDreamPost
ఏడాదిన్నర గ్యాప్ తో నితిన్ హీరోగా వస్తున్న సినిమా భీష్మ. రష్మిక మందన్న హీరోయిన్ గా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి ఇప్పటికే కావాల్సినంత బజ్ వచ్చేసింది. ఎంటర్ టైన్మెంట్ తో పాటు రైతులకు సంబంధించిన ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సెప్ట్ ని తీసుకున్న వెంకీ కుడుముల క్లాస్ మాస్ కు కావాల్సిన అన్ని అంశాలను ఇందులో జోడించినట్టు కనిపిస్తోంది. దీని తాలూకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ట్రేడ్ లో ఆసక్తి రేపుతోంది.
విశ్వసనీయ సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాలకు భీష్మ 18 కోట్ల 75 లక్షల బిజినెస్ చేసినట్టు తెలిసింది. ఇందులో నైజామ్ అత్యధికంగా 6 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోగా తక్కువగా నెల్లూరు 70 లక్షలకు సేల్ అయ్యింది. కర్ణాటకలో కోటి 30 లక్షలు, ఓవర్సీస్ లో కోటి 80 లక్షల రీజనబుల్ డీల్స్ సెట్ చేసుకున్న భీష్మ ఎల్లుండి థియేటర్లలో అడుగుపెట్టనున్నాడు. పాజిటివ్ టాక్ వస్తే భీష్మకు ఇదేమి పెద్ద టార్గెట్ కాదు. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చాయంటే పెట్టుబడి ఈజీగా వెనక్కు తెస్తాడు.
గత వారం వచ్చిన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ తీవ్రంగా నిరాశపర్చడంతో మూవీ లవర్స్ భీష్మ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఆడియో బాగానే రిసీవ్ అయ్యింది. ట్రైలర్ కూడా ఆసక్తి రేపడంతో శుక్రవారం బాగుందనే మాట అనిపించుకోవడం భీష్మకు చాలా కీలకం. ఆపై వారం విశ్వక్ సేన్ హిట్ తప్ప ఇంకే చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడం కూడా భీష్మకు ప్లస్ అవుతోంది. రేపు ఇతర సినిమాలు రేస్ లో ఉన్నాయి కానీ క్రేజ్ పరంగా భీష్మకు ఏదీ దగ్గరలో లేదు. ఇక ఏరియాల వారీగా బిజినెస్ ఈ విధంగా ఉంది.
AREA | SHARE |
నైజం | 6.50cr |
సీడెడ్ | 3.05cr |
ఉత్తరాంధ్ర | 2.70cr |
గుంటూరు | 1.70cr |
క్రిష్ణ | 1.40cr |
ఈస్ట్ గోదావరి | 1.50cr |
వెస్ట్ గోదావరి | 1.20cr |
నెల్లూరు | 0.70cr |
Total Ap/Tg | 18.75cr |
కర్ణాటక + ROI | 1.30cr |
ఓవర్సీస్ | 1.80cr |
Worldwide | 21.85cr |