iDreamPost
iDreamPost
ఈ మధ్య కాలంలో ఆహా యాప్ ఇండిపెంట్ సినిమాల నిర్మాణంలో వేగం పెంచింది. పేరున్న ఆర్టిస్టులతో ఆసక్తికరమైన కాన్సెప్ట్ లను తీసుకుని ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామ కలాపం అందులో భాగంగా వచ్చిందే. ట్రైలర్ ఆల్రెడీ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ప్రేక్షకుల్లో దీని మీద ఆసక్తి నెలకొంది. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. రెండు గంటలకు పైగా నిడివితో రూపొందిన ఈ క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్ అంచనాలకు తగ్గట్టు సాగిందా లేదా అనేది సింపుల్ రిపోర్ట్ లో చూసేద్దాం
అనుపమ(ప్రియమణి)కు తన చుట్టుపక్కల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. దీనివల్ల ఒక్కోసారి భర్త, కొడుకుని కూడా నిర్లక్ష్యం చేస్తుంది. ఈ అలవాటే తనను ఏకంగా ఒక వ్యక్తిని హత్య చేసే దాకా తీసుకెళ్తుంది. మరో మర్డర్ కు సాక్షిగా నిలుస్తుంది. ఊహించని ఈ పరిణామానికి షాక్ తిన్న అనసూయ శవాన్ని తీసుకెళ్లి నేరుగా ఇంట్లోనే పెట్టుకుంటుంది. పోలీసులు ఆమె ఉండే అపార్ట్ మెంట్ కు వచ్చి విచారణ మొదలుపెడతారు. పనిమనిషి(శరణ్య ప్రదీప్)సహాయంతో తప్పించుకునే ప్లాన్ వేస్తుంది. ఈలోగా చాలా పాత్రలు ఈ కథలో ప్రవేశిస్తాయి. చివరికి అనుపమ తప్పించుకుందా లేదా అనేది సినిమాలోనే చూడాలి
దర్శకుడు అభిమన్యు తీసుకున్న ప్లాట్, టేకింగ్ రెండూ ఆసక్తికరంగా సాగాయి. చాలా లాజిక్స్ ని కన్వీనియంట్ గా వదిలేసినప్పటికీ బోర్ కొట్టకుండా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే రెండు మూడు క్యారెక్టర్లకు క్యాస్టింగ్ సరిగా కుదరలేదు. మెయిన్ విలన్ గా జాన్ విజయ్ అతని డబ్బింగ్ రెండూ నప్పలేదు. అనుపమ భర్తను సరిగా వాడుకోలేదు. చర్చి ఫాదర్ గా కంచెరపాలెం కిషోర్ చాలా డిఫరెంట్ గా చేశారు. ఫిదా ఫేమ్ శరణ్య ప్రదీప్ ఆకట్టుకుంది. గర్భిణీ పోలీస్ గా చేసిన శాంతి రావు పర్లేదు. దీపక్ కెమెరా, జస్టిన్ ప్రభాకరన్ – మార్క్ రాబిన్ ల జంట సంగీతం హెల్ప్ అయ్యాయి. తక్కువ లొకేషన్ల క్వాలిటీ చూపించారు. బాగా ఇంటెలిజెంట్ గా ఆలోచించే వాళ్లకు ఈ భామ కలాపం కొంత సిల్లీగా అనిపించవచ్చు కానీ థ్రిల్లర్ లో ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ నిరాశపడే ఛాన్స్ తక్కువ.
Also Read : Son Of India : ఆవేశం నిండిన పాత్రలో కలెక్షన్ కింగ్