Idream media
Idream media
మమ్మీ సినిమా చూసిన వాళ్లకి , మిడతల దండు దాడి చేయడం గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలాంటి దండు ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. అందులో మనం కూడా ఉన్నాం.
గ్లోబల్ వార్మింగ్, ఇష్టమొచ్చినట్టు రసాయనాలు వాడడం, సముద్రాలని కూడా కలుషితం చేయడం, మనిషి చేస్తున్న ఘోరాలు అన్నీఇన్నీ కాదు. వీటన్నిటి ఫలితంగా అకాల వర్షాలు , తుపానులు ,సునామీలు.
మిడత చూడ్డానికి చాలా చిన్నపురుగు. దీని ప్రత్యేకత ఏమంటే ఇది ఒంటరిగా ఉండదు. ఎక్కడికి వెళ్లినా ఒక సైన్యంగా వెళుతుంది. అందుకే మిడతల దండు అంటారు. రోజుకి 150 కి.మీ ప్రయాణం చేయగల మిడత , తన జీవిత కాలంలో 2000 కి.మీ వరకు వెళుతుంది.
మొదట సోమాలియా దీనిభారీన పడి పంటల్ని నష్టపోయింది. అది పేద దేశం. మనుషులు చచ్చిపోయినా ఎవరూ పట్టించుకోరు. అందుకే వార్తల్లోకి రాలేదు. తర్వాత మిడతలు అనేక దేశాలు ప్రయాణించి పాకిస్తాన్ చేరుకున్నాయి. వాటికి పాస్‌పోర్ట్, వీసా అక్కర్లేదు. అవి ఒక రకంగా ఆహార ఉగ్రవాదులే అయినా ఎవరూ కాల్చి చంపరు.
తర్వాత గుజరాత్, రాజస్థాన్‌ల మీద పడ్డాయి. పంటలు నాశనం అవుతుంటే రైతులు కంగారు పడి సాంప్రదాయ పద్ధతుల్లో టపాసులు కాల్చడం, పెద్ద శబ్దాలు చేయడంతో అవి పోతాయనుకున్నారు. కానీ పోలేదు. వ్యవసాయాధికారులు చేతులెత్తేశారు.
మన దేశంలో వ్యవసాయశాఖ అంత బోగస్ ఇంకోటి లేదు. వాళ్ల సలహాలతో వ్యవసాయం చేస్తే మిగిలేది చిప్పే.
హెలికాప్టర్ నుంచి పురుగుల మందు చల్లాలని వాళ్లు సూచించారు. దీనివల్ల ఎన్ని దుష్ఫలితాలు వస్తాయో తెలియదు.
వెనుకటికి చంద్రబాబు, వాన కోసం రైన్‌గన్‌లు వాడాడు గుర్తు ఉందా?