iDreamPost
iDreamPost
మనమంతా ఎక్కువగా నీరు తర్వాత తాగే పానీయం టీ. టీలో చాలా రకాలు ఉన్నాయి. కానీ వాటిలో ఆరోగ్యానికి మంచిది గ్రీన్ టీ. కాబట్టి దానిని తాగడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. గ్రీన్ టీ కొద్దిగా వగరు రుచిని కలిగి ఉంటుంది. దీనిని తాగితే ఎక్కువ ఉత్సాహాన్ని, ఎనర్జీని ఇస్తుంది. దీనిని చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీలో నిమ్మరసం లేదా తేనెని కూడా కలుపుకొని తాగొచ్చు.
గ్రీన్ టీ తాగడం వల్ల ఉన్న ఉపయోగాలు..
#బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని రోజూ తాగాలి.
#గ్రీన్ టీని రోజూ త్రాగడం వలన మెదడు చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
#గ్రీన్ టీ త్రాగడం వలన డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
#హైబీపీ తగ్గించడానికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.
#కాన్సర్ నివారణకు కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.
# గ్రీన్ టీని చల్లారబెట్టి ముఖానికి ప్యాక్ లాగా వాడడం వలన చర్మానికి ముడతలు రాకుండా ఉంటాయి.
#వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్ లను కళ్ళ కింద పెట్టుకుంటే కళ్ళ కింద వచ్చిన నల్లని వలయాలు కూడా తగ్గుతాయి.