Vinay Kola
Health Tips: నాన్ వెజ్ తింటే లాభాలు ఉన్నాయి కానీ.. 30 రోజులు తినకుండా ఉంటే కొన్ని మార్పులు జరుగుతాయి.
Health Tips: నాన్ వెజ్ తింటే లాభాలు ఉన్నాయి కానీ.. 30 రోజులు తినకుండా ఉంటే కొన్ని మార్పులు జరుగుతాయి.
Vinay Kola
మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపైన కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. తినే ఆహారంలో ఏమాత్రం తేడా వచ్చినా కచ్చితంగా మన హెల్త్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఇక మనలో చాలా మంది నాన్ వెజ్‌ప్రియులు ఉంటారు. చాలా ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకొంత మంది అయితే రోజు నాన్ వెజ్ తినడానికి కూడా వెనకాడరు. అయితే మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొంత ప్రయోజనం ఉన్నా కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అది కూడా ఎక్కువ అయితేనే ఇబ్బందులు ఉంటాయి. వారానికి ఒకటి రెండు సార్లు తింటే పర్లేదు. ఎక్కువైతేనే తిప్పలు తప్పవు. ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కచ్చితంగా కాలక్రమేణ గుండెపోటు వంటి సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక నెల రోజుల పాటు నాన్ వెజ్ తినకుండా ఉంటే మన శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయట. ఇంతకీ మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..
ఒక నెల రోజుల పాటు నాన్ వెజ్‌ను పూర్తిగా మానేసి.. కూరగాయలను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు అందుతాయి. మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నీరసంగా అస్సలు ఉండరు. ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉంటారు. నాన్‌వెజ్‌లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఇది బాడీలో కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. అయితే ఒక నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ లోకి వస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ క్రమగా తగ్గిపోతుంది. ఒక నెల రోజుల పాటు నాన్ వెజ్‌ను తినడం మానేస్తే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. మన జీర్ణవ్యవస్థ అంటే డైజెషన్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది.
అధిక బరువు సమస్యతో బాధ పడే వారు నెల రోజుల పాటు నాన్ వెజ్ తినకపోతే శరీర బరువు క్రమంగా తగ్గుతుంది. ఒక నెల రోజులు నాన్ వెజ్ మానేయడం వల్ల ఇంకో బంగారం లాంటి అద్భుతం కూడా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం ఈజీగా కంట్రోల్ అవుతాయి. ఇంకా అలాగే కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం కూడా ఉండదు. నెల రోజులు తరువాత మీరు నాన్ వెజ్ తినాలకుంటే తినండి. కానీ మితంగా మాత్రమే తినండి. వారానికి ఒక రోజు మాత్రమే తినండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.