iDreamPost
android-app
ios-app

Health: ప్రతి రోజూ అరగంట వాకింగ్ చేస్తే బాడీలో ఎంత మంచి జరుగుద్దో తెలుసా?

  • Published Nov 21, 2024 | 6:02 PM Updated Updated Nov 21, 2024 | 6:02 PM

Health: వాకింగ్ అనేది చాలా ఈజీ వ్యాయామం. ప్రతి రోజూ ఒక అరగంట వాకింగ్ చేస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Health: వాకింగ్ అనేది చాలా ఈజీ వ్యాయామం. ప్రతి రోజూ ఒక అరగంట వాకింగ్ చేస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Health: ప్రతి రోజూ అరగంట వాకింగ్ చేస్తే బాడీలో ఎంత మంచి జరుగుద్దో తెలుసా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీకి కచ్చితంగా పని పెట్టాలి. అయితే వ్యాయామం చేయడం అందరికీ కుదరదు కాబట్టి వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. రోజుకి అరగంట వాకింగ్ చేయడం వలన మన ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఆ ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రతిరోజూ ఒక 30 నిమిషాలు నడవడం వల్ల మన ఆయుష్షు పెరుగుతుంది. ఎక్కువ కాలం జీవించగలుగుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకి కనీసం 30 నిమిషాలు నడిస్తే గుండె జబ్బుల ముప్పును 19 శాతం తగ్గించుకోవచ్చట. రక్తపోటు నియంత్రణ, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోని మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజుకి 30 నిమిషాలు వాకింగ్ చేస్తే మన బరువు కంట్రోల్ లో ఉంటుంది. వాకింగ్ వల్ల కెలోరీలు కరుగుతాయి. అందువల్ల బరువు తగ్గుతారు. వాకింగ్ కేవలం మన శరీరానికే కాదు… మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల కుంగుబాటు, మానసిక ఆందోళన ఈజీగా తగ్గిపోతాయి. మనిషిలో కలిగే భావాలను కంట్రోల్ చేసే ఎండోమార్ఫిన్స్ ను నడక యాక్టివేట్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాకింగ్ మానసిక ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. అంతేగాక నడక వల్ల క్రియేటివిటీ కూడా పెరుగుతుందట. చాలా చురుగ్గా ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేస్తే మనసు కుదుటపడడమే కాకుండా, చక్కని ఐడియాలు కూడా వస్తాయట.

నడక వల్ల కండరాలు, ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. ముఖ్యంగా, కాళ్లకు, నడుము భాగం పటిష్టతకు నడక ఉపయోగపడుతుంది. నడక వల్ల ఆస్టియోపొరోసిస్ ముప్పు తగ్గుతుందట. మనకు ఏమైన ప్రమాదం జరిగినప్పుడు కూడా ఎముకలు విరగడం వంటివి జరగవు. భోజనం తర్వాత అరగంట నడిస్తే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయంలోని కండరాలు యాక్టివేట్ కావడానికి నడక సహయపడుతుంది. పేగుల్లో కదలికలు జరిగి మలబద్ధకం సమస్య దూరమవుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ కచ్చితంగా పెరుగుతుంది. ప్రతి రోజూ 30 నిమిషాలు నడిచేవాళ్లు చలికాలంలో అనారోగ్యాలకు గురికావడం చాలా తక్కువ. జలుబు, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలైనా వాకింగ్ చేయండి. సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.