iDreamPost
iDreamPost
భయపడినంతా అయ్యింది. భారీ అంచనాలతో విడుదలైన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ థియేట్రికల్ రిలీజ్ డిజాస్టర్ వైపుగా వెళ్తోంది. సుమారు 30 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ మూవీని డిస్ట్రిబ్యూటర్లకు చాలా రీజనబుల్ రేట్లకే ఇచ్చేశారు. అయినా ఇప్పటిదాకా వచ్చింది కేవలం 13 కోట్లేనని ట్రేడ్ టాక్. అంటే ఇంకా సగానికి పైగా రావాలి. వీక్ డేస్ లో ఇప్పటికే డ్రాప్ ఉంది. ఈ శుక్రవారం అమితాబ్ బచ్చన్ ఇమ్రాన్ హష్మీల ఛెహ్రే విడుదల కాబోతున్న నేపథ్యంలో భారీ నష్టాలు తప్పకపోవచ్చని ముంబై మీడియా న్యూస్. ఇదే నిజమైతే సూర్యవంశీ లాంటి మల్టీ స్టారర్లు మరింత ఆలస్యం కాక తప్పదు. ఆల్రెడీ ఏడాదికి పైగా ఇది ల్యాబులో మగ్గుతోంది.
అక్షయ్ కుమార్ కు గత తొమ్మిదేళ్లలో ఇలాంటి ఫ్లాప్ రాలేదు. మరీ దారుణంగా ఉందనిపించుకున్న ఆఖరి చిత్రం 2012లో వచ్చిన జోకర్. దీని దెబ్బకు పంపిణీదారులు లబోదిబోమన్నారు. ఆ తర్వాత సబ్జెక్టు ఏదైనా అక్కి మార్కెట్ మినిమమ్ వంద కోట్లు పలికింది. ఇక బ్లాక్ బస్టర్ అయితే రెండు వందల కోట్లకు దగ్గరగా వెళ్ళినవి కూడా ఉన్నాయి. కానీ ఇలా మరీ పట్టుమని పాతిక కోట్లు కూడా రాబట్టలేని బెల్ బాటమ్ పరిస్థితి ఇంత దయనీయంగా మారడం ఎవరూ ఊహించనిది. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసి మంచి రివ్యూలు తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాకు ఇలా జరగడం ఎగ్జిబిషన్ రంగానికి షాకే.
దీన్ని బట్టి అర్థమవుతోందేంటంటే తెలుగు ప్రేక్షకులు చేసినంత ధైర్యం ప్రపంచంలో ఇంకెవరు చేయలేకపోతున్నారు. నిన్న ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిథిగా వెళ్లిన త్రివిక్రమ్ ఇదే మాట అన్నారు. లేకపోతే బాగానే ఉంది అనిపించుకున్న ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమా 8 కోట్ల షేర్ రాబట్టుకోవడం అంటే మాటలా. ఓవర్సీస్ లో కొన్ని చోట్ల బెల్ బాటమ్ కంటే రాజరాజ చోర కలెక్షన్లే ఎక్కువ ఉన్న మాట వాస్తవం. ఈ కారణంగానే ఎక్కడా లేని రిలీజులు ఒక్క టాలీవుడ్ లోనే సాధ్యమవుతున్నాయి. జులై 30 నుంచి లెక్కబెట్టుకుంటే ఇప్పటికే పాతిక పైగా రిలీజులు అయ్యాయి. ఇంకెక్కడా ఇలా జరగలేదు.
Also Read : బట్టతల యువకుడి అందమైన బయోపిక్