iDreamPost
android-app
ios-app

చైనా నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు తెప్పించి ప్రభుత్వ హాస్పటల్స్ కు ఇచ్చిన BMR

చైనా నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు తెప్పించి ప్రభుత్వ హాస్పటల్స్ కు ఇచ్చిన BMR

కొంత మంది రాజకీయ నేతలు పదవిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు అంతో ఇంతో సహాయం చేస్తుంటారు. అందుబాటులో ఉంటారు. మరికొంత మంది పదవి ఉన్నా లేకపోయినా.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. సమస్యలు, కష్టాల్లో వారిని అదుకుంటారు. రెండో కోవకు చెందిన వారే వైసీపీ నాయకుడు బీద మస్తాన్‌ రావు (బీఎంఆర్‌). వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి వచ్చిన బీద మస్తాన్‌ రావు.. పదవులు,అధికారంతో సంబంధం లేకుండా  తనను నమ్ముకున్న వాళ్లకు అండగా ఉన్నారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని వేలాది మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించడంతోపాటు వారికి అనేక విధాలుగా సహాయసహకారాలు అందించారు బీద మస్తాన్‌ రావు. గత ఏడాది కరోనా విజృంభన, లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, పేద వారికి నిత్యవసరాలు విరివిగా అందించారు. నాటి పరిస్థితులు అనుగుణంగా ప్రజలకు ఆపన్న హస్తం అందించిన బీద మస్తాన్‌ రావు.. కరోనా సెకండ్‌ వేవ్‌లోనూ తానున్నానంటూ ముందుకు వచ్చారు.

Also Read:చిరు “ఆక్సిజన్” బ్యాంకులు అభినందనీయం అంటున్న నిపుణుల

కరోనా సెకండ్‌ వేవ్‌లో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత తలెత్తింది. తగినంత ఆక్జిజన్‌ అందుబాటులో లేకపోవడంతో పలువురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా, నిల్వ చేసేందుకు అవసరమైన పరికరాలు తగినంతగా అందుబాటులో లేని పరిస్థితుల్లో ఓ వైపు ప్రభుత్వం వాటిని సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. అదే సమయంలో బీద మస్తాన్‌ రావు వంటి నేతలు.. తమ వంతుగా ప్రభుత్వానికి, కరోనా బాధితులకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే బీద మస్తాన్‌ రావుకు వ్యాపార రీత్యా చైనా కంపెనీలతో ఉన్న సంబంధాలు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు తెప్పించేందకు ఉపయోగపడింది.

చైనా నుంచి 350 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు తెప్పించిన బీద మస్తాన్‌ రావు.. వాటిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లాలకు 200, ప్రకాశం జిల్లాకు 110 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను బీద అందించారు. మరో 40 వివిధ సంస్థలకు ఇచ్చారు. వీటిని ప్రభుత్వ అధికారుల ద్వారా అవసరమైన ఆయా ఆస్పత్రులకు పంపించారు.

Also Read:జగన్ రెండేళ్ళ ప్రస్థానం – రెండు అడుగులు

బీద మస్తాన్‌ రావు చొరవ వల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులలో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ కొరత సమస్య దాదాపుగా తీరిపోయింది. ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలు నిలిపేందుకు బీద మస్తాన్‌రావు చేసిన సహాయాన్ని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారనడంలో సందేహం లేదు.