అమరావతి తో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కొరకు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన అంతర్జాతీయ దిగ్గజ కన్సల్టింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈరోజు తమ తుది నివేదికనిముఖ్యమంత్రి కి అందజేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే గత నెల 21 న బీసీజీ తన మధ్యంతర నివేదికని రాష్ట్రప్రభుత్వానికి అందించడం తెలిసిందే.1963 లో అమెరికా కేంద్రంగా స్థాపించిన ప్రపంచ ప్రఖ్యాత మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ గ్రూప్ అయినా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలలో 90 కి పైగా కార్యాలయాలున్నాయి.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుతానికి సమర్పించిన మధ్యంతర నివేదికలో గ్రీన్ ఫీల్డ్ రాజధాని ( అంటే కొత్తగా నిర్మించే రాజధాని) కంటే బ్రౌన్ ఫీల్డ్ రాజధాని (ఇప్పటికే ఉన్న నగరం) అయితే సత్వరం అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉందని సూచించిన నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రికి అందజేయనున్న తుది నివేదికలో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ కమిటీ పూర్తిస్థాయి నివేదికని ప్రభుత్వానికి అందించాక దీనితో పాటు ఇప్పటికే ప్రభుత్వనికి అందిన జియన్ రావు కమిటీ తో కలిపి ఈ రెండు కమిటీలను క్షుణ్ణంగా అధ్యనం చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక హైపర్ కమిటీని నియమించిన సంగతి మనందరికీ తెలిసిందే.
గత అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగన్ మాట్లాడుతూ రాష్ట్రానికి 3 రాజధానులు రావొచ్చని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే తమ నివేదికని సమర్పించిన జియన్ రావు కమిటీ కూడా విశాఖ పట్టణాన్ని ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ చెయ్యాలని సూచించడంతో ఆ కమిటీ రిపోర్ట్ కు బలం చేకూర్చుతూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా తమ మధ్యంతర నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించడం తో జగన్ ప్రభుత్వం చేస్తున్న వాదనకి బలం చేకూర్చినట్టయింది. ఇప్పటికే జియన్ రావు కమిటీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో చర్చించిన ప్రభుత్వం ఈరోజు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రాష్ట్రప్రభుత్వానికి అందజేయనున్న పూర్తి స్థాయి నివేదిక పై ఈ నెల 8 న జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపర్ కమిటీ ద్వారా ఈ రెండు కమిటీల పై సమగ్రంగా అధ్యయనం చేసి హాపర్ కమిటీ తన నివేదికని ప్రభుత్వానికి అందించే అవకాశం వుంది కాగా జనవరి 20 తరువాత అసెంబ్లీలో హైపర్ కమిటీ నివేదిక పై చర్చించే అవకాశం వుంది