iDreamPost
android-app
ios-app

బాసర ట్రిపుల్ ఐటీ లో విషాదం.. తల్లిదండ్రులకు తీరని గుండెకోత!

  • Author Dharani Published - 06:18 PM, Tue - 13 June 23
  • Author Dharani Published - 06:18 PM, Tue - 13 June 23
బాసర ట్రిపుల్ ఐటీ లో విషాదం.. తల్లిదండ్రులకు తీరని గుండెకోత!

ఈకాలం పిల్లలకి ఓర్పు, సహనం తగ్గి పోతున్నాయి. ఏంత దారుణంగా తయారవుతున్నారంటే వీడియో గేమ్ లో ఓడిపోయినా తట్టుకోలేకపోతున్నారు. ఏంతో అపురూపమైన మానవ జన్మను.. చిన్న చిన్న కారణాలకు ముగించుకుంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని, ఫ్రెండ్స్ ఏదో అన్నారని చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. బిడ్డలే లోకంగా బతుకుతున్న తల్లిదండ్రుల గుండెల్లో అరని చితి మంటలు రగిలిస్తున్నారు. చదువుకుంటూ మంచి చేదు విచక్షణ తెలుసుకోవాల్సిన పిల్లలు.. ఏకంగా ప్రాణాలు తీసుకోవాలనే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రం లో విద్య సంస్థలు తెరిచి రెండు రోజులు కూడా కాలేదు.. అప్పుడే రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి.

బుధవారం ఉదయం నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి బిల్డింగ్‌ ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడవగా.. తాజాగా.. బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. బాసర క్యాంపస్‌లో పీయూసీ రెండో ఏడాది చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. హాస్టల్ బాత్‌రూంలో చున్నీ సాయంతో ఉరేసుకుంది. బుధవారం ఉదయం బాత్‌రూంకి వెళ్లిన దీపిక ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో.. తోటీ విద్యార్థులు.. దీని గురించి హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే.. భద్రతా సిబ్బంది డోర్లు పగలగొట్టి చూడగా.. ఆమె కిటికీకి ఉరేసుకొని కన్పించింది.

వెంటనే విద్యార్థిని బైంసా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం బాడీని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని సంగారెడ్డి జిల్లాకు చెందినదిగా గుర్తించారు. అయితే దీపిక మృతికి కారణాలు తెలియరాలేదు. చదువుల వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకుందా లేక మరదైనా ఇతర కారణాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందా అన్న విషయం ఇంకా తెలియలేదు. దీపిక మృతిపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి