P Venkatesh
మార్చి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వచ్చే నెలలో ఏకంగా అన్ని రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మొత్తం ఎన్ని రోజులంటే?
మార్చి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వచ్చే నెలలో ఏకంగా అన్ని రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మొత్తం ఎన్ని రోజులంటే?
P Venkatesh
కొత్త ఏడాది ప్రారంభమై రెండు నెలలు కూడా గడిచిపోవచ్చింది. ఇంకొన్ని రోజుల్లో మార్చి నెల మొదలుకానున్నది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. మీకు ఏవైనా బ్యాంకు పనులు ఉన్నట్లైతే బ్యాంకులు ఏరోజుల్లో పనిచేస్తాయో ముందుగానే తెలుసుకుంటే మంచిది. లేదంటే మీ పనుల్లో జాప్యం జరుగొచ్చు.. లేదా మీ సమయం వృధా కావొచ్చు. ఇప్పుడు చాలా వరకు లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నప్పటికీ కొన్ని పనులకు అంటే.. ఖాతాకు సంబంధించిన సమస్యలు, లోన్స్ వంటి ఇతర అవసరాల కోసం నేరుగా బ్యాకులకు వెళ్లాల్సి ఉంటుంది. మరి వచ్చే మార్చి నెలలో ఎన్ని రోజులు.. ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మార్చి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వచ్చే నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. వీటిల్లో ఐదు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలతోపాటు మరో ఏడు రోజులు బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని జాతీయ సెలవుల రోజు అన్ని బ్యాంకులకు సెలవు ఉండగా.. స్థానిక పండగల్ని బట్టి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మార్చి 1, 8, 22, 25, 26, 27, 29 తేదీల్లో బ్యాంకులకు సెలవులు. 3, 10, 17, 24, 31 తేదీల్లో ఐదు ఆదివారాలు, 9, 23 తేదీల్లో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు ఉండనున్నాయి.