Keerthi
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన బర్డ్ ఫ్లూ కేసుల గురించి అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ప్రాతంలో మాత్రం నిజంగా బర్డ్ ఫ్లూ వచ్చిందని అధికారులు ప్రకటించడంతో పాటు.. అక్కడ చికెన్ అమ్మకాలను నిషేధించారు.
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన బర్డ్ ఫ్లూ కేసుల గురించి అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ప్రాతంలో మాత్రం నిజంగా బర్డ్ ఫ్లూ వచ్చిందని అధికారులు ప్రకటించడంతో పాటు.. అక్కడ చికెన్ అమ్మకాలను నిషేధించారు.
Keerthi
బర్డ్ ప్లూ.. గత కొన్నిరోజులుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్ల ఈ వైరస్ కేసులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వైరస్ సోకిన కోళ్లను తింటే మనుషుల ప్రాణానికే ప్రమాదం ఉందని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కోళ్ల అమ్మాకాలను నిషేధించారు. అలాగే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన కోళ్లను చంపేయాలని కోళ్లఫారం యజమానులను ఆదేశిస్తున్నారు. అయితే ఇప్పటికే కేరళలో పలుమార్లు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి పై అనేక కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులే అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాళ్లోకి వెళ‍్తే..
ఇటీవల కాలంలదో కేరళ రాష్ట్రంలో వరుసగా బర్డ్ ఫ్లూ కేసుల గురించి అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ రాష్ట‍్రంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులే అధికారికంగా ప్రకటించారు. కాగా, కొట్లాయం ప్రాంతంలోని మన్నార్ ఖడ్ ప్రాంతంలోని కోళ్లఫారాల్లో.. కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు 2024, మే 24వ తేదీన అధికారికంగా అధికారులు నిర్ధారించారు. ఇక బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా వెంటనే చర్యలు చేపట్టారు. అలాగే కేరళ పశు సంవర్థక శాఖ అధికారులు. మన్నార్ ఖడ్ ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు రక్షణ చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే.. ఆయా ప్రాంతాల్లోని కోళ్లఫారాల్లోని కోళ్లకుఅధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొట్టాయం ప్రాంతంలోని మన్నార్‌క్కాడ్, పుతుప్పల్లి పంచాయతీల పరిధిలో కోళ్లు, చికెన్, కోడి గుడ్లు అమ్మకాలపై నిషేధం విధించారు. అంతేకాకుండా.. వెంటనే అన్ని కోళ్లను చంపేయాలని కోళ్లఫారం యజమానులను ఆదేశించారు. ఇక ఈ రెండు ప్రాంతాల్లో చికెన్, గుడ్లుతో పాటు బాతులు, పక్షి మాంసాలపై కూడా అధికారులు నిషేధం విధించారు. అలాగే ప్రజలు ఎవరూ చికెన్ కొనుగోలు చేయొద్దని అధికారులు ఆదేశించారు.
అయితే మన్నార్‌క్కాడ్ పంచాయతీలోని 12, 13, 14 వార్డులలో కోడి, బాతు, పిట్ట మరియు ఇతర పెంపుడు పక్షుల గుడ్లు, మాంసం, ఎరువు అమ్మకం, దిగుమతి నిషేధించేందుకు అధికారులు 1 కి.మీ నుంచి 10 కి.మీ వరకు నిఘా జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మొన్నటి వరకు సోషల్ మీడియాలో బర్ట్ ప్లూ పై కథనాలే వచ్చేవి కానీ, ఇప్పుడు నిజంగా బర్ట్ ప్లూ వచ్చేసిందంటూ ఆశ్చర్యనికి గురవుతున్నారు.