iDreamPost
android-app
ios-app

Liger : పూరీ వాడకం… మైక్ టైసన్ తో పాటు బాలయ్య కూడా?

Liger : పూరీ వాడకం… మైక్ టైసన్ తో పాటు బాలయ్య కూడా?

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, అప్పటికి హిట్ కొట్టి ఇస్మార్ట్ శంకర్ అంటూ మంచి ఫాంలో ఉన్న పూరి జగన్నాథ్ జట్టుగా ఒక బాక్సింగ్ నేపథ్యంలో సినిమా మొదలు పెట్టారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ముందు నుంచి చర్చనీయాంశంగా మారుతూనే ఉంది.. ఎందుకంటే కేవలం పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పూరి జగన్నాథ్ చార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు అంటూ మొదలైంది. కానీ ఈ సినిమా కథలో ఉన్న విషయం అర్ధం చేసుకుని కరణ్ జోహార్ తాను కూడా సినిమాలో నిర్మాతగా భాగస్వామిని అవుతానని అడుగుపెట్టారు.

అలా ఈ సినిమాను కరణ్ జోహార్ పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నటు అయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు ఇండియన్ తెరమీద కనిపించని మైక్ టైసన్ యాక్టింగ్ చేయిస్తూ పూరి జగన్నాథ్ ఒక సంచలనానికి తెర లేపాడు. అయితే బాలయ్య ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేయనున్నాడనే వార్త ఆసక్తిగా మారింది. బాలకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ ఫలితం ఎలా ఉన్నా బాలయ్య అభిమానులకు కలలో సైతం అసాధ్యం అనుకున్న సినిమాలాగా దాన్ని తెరకెక్కించాడు. బాలయ్యకు పూరి ఫ్యాన్ అయిపోగా బాలయ్యకు కూడా పూరితో బాండింగ్ ఏర్పడింది.

దీంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా చేయనున్నట్లు ఇద్దరూ చెప్పారు కానీ పట్టాలు ఎక్కలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ముందు మైక్ టైసన్ పాత్రకు బాలయ్యతో డబ్బింగ్ అన్నారు కానీ ఇప్పుడు అతిధి పాత్ర అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ పూరితో బాలకృష్ణకి ఉన్న అనుబంధం రీత్యా పూరీ అడిగితే బాలయ్య కాదనడు. ఆడే నిజమైతే మరో రచ్చ రంబోలా కాంబో సెట్ అయినట్టే. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్ తో కలిసి పూరి, ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాపై అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.

Also Read : Marakkar Report : మరక్కార్ అరేబియా సముద్ర సింహం రిపోర్ట్

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş