iDreamPost
android-app
ios-app

16వ సారి బాలయ్య డబుల్ ఫోటో

  • Published Feb 26, 2020 | 8:06 AM Updated Updated Feb 26, 2020 | 8:06 AM
  • Published Feb 26, 2020 | 8:06 AMUpdated Feb 26, 2020 | 8:06 AM
16వ సారి బాలయ్య డబుల్ ఫోటో

ఏ హీరోకైనా డ్యూయల్ రోల్ అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. అందులోనూ స్టార్ మాస్ హీరోల అభిమానులకు ఇది కన్నుల పండుగే. ఇక నందమూరి బాలకృష్ణలాంటి హీరో అయితే చెప్పేదేముంది. తాజాగా బోయపాటి శీను దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభించబోతున్న బాలయ్య దాని కోసమే ప్రత్యేకంగా జుట్టు తీయించుకుని మరీ కొత్త హెయిర్ స్టైల్ తో రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన కొత్త అప్ డేట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది. దాని ప్రకారం ఈ మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.

ఇప్పటిదాకా బాలయ్య ఇలా 15 సినిమాల్లో నటించాడు. అపూర్వ సహోదరులు, రాముడు భీముడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర, ఆదిత్య 369, మాతో పెట్టుకోకు, శ్రీ కృష్ణార్జున యుద్ధం, పెద్దన్నయ్య, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి, అల్లరి పిడుగు, ఒక్క మగాడు, పాండురంగడు, సింహ,పరమవీరచక్ర, లెజెండ్ ఇలా ఇప్పటిదాకా బాలయ్య చేసిన డబుల్ ఫోటో సినిమాలు. ఇందులో సగం సూపర్ హిట్లు కాగా మిగిలిన సగం డిజాస్టర్లు అయ్యాయి. ఫెయిల్ అయినవాటిలో కూడా కొన్ని నటన పరంగా బాలయ్యకు మంచి పేరు తీసుకొచ్చాయి.

ఇప్పుడు బోయపాటితో చేయబోతున్న సినిమా పదహారోది. ఇప్పటికే దీని మీద అంచనాలు నెలకొంటున్నాయి. గత కొంతకాలంగా దారుణమైన ఫలితాలు అందుకుంటున్న బాలకృష్ణకు దీని సక్సెస్ చాలా కీలకం. రూలర్ తన ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసిన నేపథ్యంలో కథ విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో హీరోయిన్లుగా శ్రేయ శరన్, అంజలిని కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో చేసే రెండు పాత్రల్లో ఒకటి అఘోరా అని ఇప్పటికే ప్రచారంలో ఉండగా మరొకటి సీమ స్లాంగ్ లో సాగుతూ డిఫరెంట్ గా ఉంటుందట .ఇది నిజమో కాదో కాని మొత్తానికీ వార్త బాలయ్య ఫాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom