Idream media
Idream media
ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అందుకోసం నేను దేనికైనా సిద్ధమే అంటూ ఆయన ప్రకటించారు. మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సి ఉంది అని డిమాండ్ చేశారు. జిల్లాకు ఏ పేరు అయినా పెట్టుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అధికార వైసిపి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మా కార్యాచరణ కూడా ఉంటుంది అని హెచ్చరించారు.
అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తాం.. జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్ధమే అని ఆయన స్పష్టం చేేశారు. మా గోడు తెలిపి విన్నవించుకుంటాను అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎన్టీఆర్ జిల్లా పేరు.. జిల్లాల ప్రకటన అంటూ ఆయన ఆరోపణలు చేశారు . నిజమైన ప్రేమ ఉంటే చంద్రబాబు ఎన్టీఆర్ పెట్టిన పథకాలను కంటిన్యూ చేయాలి అని డిమాండ్ చేేశారు.
రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్, చంద్రబాబు పథకాలను కంటిన్యూ చేశారని గుర్తు చేశారు. ఇక ఇదిలా ఉంటే… బాలకృష్ణ ఎమ్మెల్యే గా బాధ్యతలు చేపట్టిన 8 ఏళ్ళ కాలంలో పెద్దగా నియోజకవర్గానికి వెళ్ళింది. జిల్లా పర్యటనలు గాని నియోజకవర్గ పర్యటనలు గాని, పార్టీ సమావేశాల్లో పాల్గొనడం గాని ఏ ఒక్కటి జరగలేదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళడం, అక్కడ రెండు రోజులు ఉండటం, తిరిగి రావడం వంటివి చేస్తూ ఉండేవారు. ఇక జిల్లా సమస్యలు గాని హిందూపురం పార్లమెంట్ లో ఉన్న సమస్యలు గాని ఆయన మాట్లాడిన సందర్భం లేదనే చెప్పాలి.
ఇప్పుడు అనూహ్యంగా జిల్లా కావాలని డిమాండ్ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. నియోజకవర్గంలో తన బాధ్యతలను తనతో సన్నిహితంగా ఉండే వారికి అప్పగించడం, ఫోన్ లో మాట్లాడి సమస్యలు పరిష్కరించా అని చెప్పడం కాస్త వింతగా ఉంటుంది. ఇప్పుడు జిల్లా కోసం రాజీనామా చేస్తా అని బాలకృష్ణ ప్రకటించడం, టీడీపీకి మైలేజ్ తీసుకురావడం కంటే ఆయన కామెంట్స్ కామెడీ అవుతున్నాయి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య మీద కూడా బాలకృష్ణ పెద్దగా దృష్టి సారించలేదు అనే ఆరోపణ ఉంది. చంద్రబాబు ఉన్న సమయంలో హిందూపురం జిల్లా కేంద్రం గురించి గాని ప్రత్యేక జిల్లాల గురించి మాట్లాడటం గాని జరగలేదు.
Also Read : బాలయ్యకు ఉన్న చిత్తశుద్ధి.. బాబుకు లేకపాయనే..!