Krishna Kowshik
Krishna Kowshik
నట సింహం బాలకృష్ణ హీరోగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా భగవంత్ కేసరి. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, డాన్స్ క్వీన్ శ్రీలల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా గురువారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాలోని టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ కూడా ఊపేస్తుంది. అఖండ, వీరసింహరెడ్డి సినిమాలకు మ్యూజిక్ అందించిన తమన్ ఈ సినిమాతో మ్యాజిక్ చేయాలని భావిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. బాలయ్య నుండి వస్తున్న 108వ చిత్రం భగవంత్ కేసరి. అయితే ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో స్టైల్ ఉన్నట్లే.. పాటల్లో కూడా ఓ థీమ్ ఉంటుంది. అదే పాత పాటలను.. మరో హీరోతో రీమేక్ చేయడం. పటాస్ మూవీలో అరే వో సాంబ (రౌడీ ఇన్ స్పెక్టర్), సుప్రీమ్ సినిమాలో.. అందం ఇందోళం (యుముడికి మొగుడు) సాంగ్ రీ క్రియేట్ చేయించారు. అలాగే ఎఫ్ 2లో కుర్రాడు బాబోయ్ (సుమన్ మూవీ చిన్నల్లుడు) పాటను.. వెంకీతో స్టెప్పులు వేయించారు. ఇప్పుడు రాబోయే సినిమా భగవంత్ కేసరిలో కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు అభిమానులు. అయితే ఈ సారి బాలయ్య హిట్ సాంగ్ రీ క్రియేట్ చేశారని టాక్. అదే దంచవే మేనత్త కూతురా సాంగ్. బాలయ్య మూవీ మంగమ్మ గారి మనవడు సినిమాలోని ఆ పాటను రీమేక్ చేశారని తెలుస్తోంది. ఈ పాట కోసం దాదాపు మూడున్నర కోట్లు ఖర్చు కూడా చేశారట.
అయితే ఈ పాటను మాత్రం మూవీ నుండి డిలీట్ చేశారని గుస గుసలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలై.. తొలి షో పడేంత వరకు దీనిపై క్లారిటీ లేదు. ఈ పాటను రీమేక్ చేశారా లేదా అనేది కూడా గురువారం తెలిసిపోతుంది. ఈ పాటను సినిమా నుండి తొలగించలేదని, ఫస్ట్ వీక్ పూర్తి అయ్యాక.. యాడ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని పరిశ్రమలోని కొంత మంది భావిస్తున్నారట. ఇది రీమేక్ కాదని, కేవలం వోకల్స్ మాత్రమే తీసుకున్నట్లు చెబుతున్నారు. మరీ ఆ పాట ఉందో లేదో రేపో, మాపో తేలిపోవడం ఖాయం.