iDreamPost
android-app
ios-app

క‌న్‌ఫ్యూజ‌న్ : పోటీకి, మ‌ద్దతు ఇవ్వ‌డానికి తేడా ఏంటో?

క‌న్‌ఫ్యూజ‌న్ : పోటీకి, మ‌ద్దతు ఇవ్వ‌డానికి తేడా ఏంటో?

అంత‌ర్లీనంగా ప‌రిస్థితులు ఎలాగున్నా అధికారికంగా ప్ర‌స్తుతానికి ఏపీలో జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు కొన‌సాగుతున్న‌ట్లే. పొత్తులో భాగంగా ఇరుపార్టీలు చ‌ర్చించే పోటీకి సిద్ధమవుతాయి. తిరుప‌తి లోక్ స‌భ‌ ఉప ఎన్నికలో అప్పుడు అదే జరిగింది. బీజేపీ అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించాయి. ఆ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం చేశారు. అంటే పోటీ చేసింది బీజేపీనే అయినా జ‌న‌సేన కూడా పోటీలో ఉన్న‌ట్లే లెక్క‌. ఎందుకంటే.. పొత్తు అన్న‌ప్పుడు రెండింట్లో ఒక పార్టీయే పోటీ చేస్తుంది. మ‌రొక పార్టీ మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తుంది. రెండు పార్టీల్లో ఏ పార్టీ పోటీ చేసినా అక్క‌డ రెండూ ఉన్న‌ట్లే.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. కడప జిల్లా బద్వేల్‎ ఉప ఎన్నికలో పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ఇత‌ర పార్టీలు కూడా త‌ప్పుకుంటే బాగుంటుంద‌ని సూచించారు. ఆయ‌న సూచ‌న‌ను తెలుగుదేశం పార్టీ పాటించింది కూడా. కానీ జ‌న‌సేన మిత్ర పార్టీ బీజేపీ మాత్రం పోటీ చేస్తోంది. అద‌లా ఉంటే.. బ‌ద్వేల్ లో బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేపీలో పోటీలో ఉన్న‌ప్పుడు ఎలాగూ జ‌న‌సేన‌కు పోటీ చేసే అవ‌కాశం ఉండ‌దు. బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ప్పుడు పోటీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం దేనికో అర్థం కావ‌డం లేదు.

Also Read : ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామం.. బద్వేలు బరిలో 14 పార్టీలు

బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఇక్కడ మరణించిన వైసీపీ ఎమ్మెల్యే భార్యనే నిల‌బెట్టింది. దీంతో మానవత్వం కోణంలో జనసేన ఇక్కడ పోటీచేయడం లేదని చెప్పి వైదొలిగింది. అయితే జనసేన మిత్రపక్షం బీజేపీ మాత్రం ఇక్కడ పోటీకి సై అన్నది. తాజాగా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ పార్టీతోనే జనసేన కలిసి ఉంటుందని.. బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ తరుఫున అభ్యర్థిని నిలబెట్టడం లేదని తెలిపారు.

ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు ఉన్నందున బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ఇస్తుందని తేల్చిచెప్పారు. వచ్చే రోజుల్లో కూడా పొత్తు కొనసాగుతుందని పేర్కొంది. ఈ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రచారంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నామని.. ధర్మాన్ని పాటిస్తామని.. బీజేపీ విజయం కోసం పనిచేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అయితే బీజేపీ పార్టీతో జనసేన కలిసే ఉంటుందని చెప్ప‌డం ఓకేకానీ.. బ‌ద్వేలు మిన‌హా అంటే బాగుండేది. అప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌కు విలువ ఉండేది. వైసీపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా పోటీలో ఉండేది లేద‌ని చెప్పి, దానికి వ్య‌తిరేకంగా పోటీ చేస్తున్న పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం ఏంటో అర్థం కాని ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది.

Also Read : పవన్ పాతికేళ్ల పాలసి ఏమయ్యింది ?