iDreamPost
android-app
ios-app

ఏపీ టిడిపి అధ్యక్షునిగా అచ్చెన్న? ఉత్తరాంధ్రలో పట్టుకు బాబు వ్యూహం!

ఏపీ టిడిపి అధ్యక్షునిగా అచ్చెన్న?  ఉత్తరాంధ్రలో పట్టుకు బాబు వ్యూహం!

 మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో షాక్ కు గురైన తెలుగుదేశం మెల్లగా పరిస్థితులు అర్థం చేసుకుంటోంది. మొత్తం 175 సీట్లలో కేవలం 23 స్థానాలతో చతికిలపడిన తెలుగు దేశం ఐపొడు మళ్ళీ పట్టుకోసం పావులు కదుపుతోంది.

అమరావతి రాజధాని తరలింపు విషయంలో ధర్నాలు, ఉద్యమాలు చేసినా చంద్రబాబు , ఇతర నాయకులు మరో తప్పిదాన్ని చేేసినట్లయింది. అటు రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ఎదుగుదలను అడ్డుకుంటున్నారని,కేవలం చంద్రబాబు ఆయన బినామీల ఆస్తులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఫీలింగ్ జనాల్లోకి వెళ్ళింది. ఈ నష్టాన్ని తగ్గించేందుకు బాబు కొత్త ప్లాన్ వేశారు. ఏకంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుని పదవి టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు. నిన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 34 సీట్లలో కేవలం ఆరు సీట్లనే గెలిచిన టిడిపి గీర పరాభవసన్ని మూటగట్టుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటారావే(కాపు) స్వయంగా ఎచ్చెర్లలో ఓడిపోవడం మరింత అవమానకరం అయింది. ఈ నేపథ్యంలో వెలమ వర్గానికి చెందిన అచ్చెన్నకు పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా తాము ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతం ప్రజల్లోకి పంపాలన్నది చంద్రబాబు ఉద్దేశం ల ఉన్నది.

అసెంబ్లీలో టిడిపి వాయిస్ ను గట్టిగా వినిపించడంతోబాటు చంద్రబాబుకు విధేయుడిగా ఉన్న అచ్చెన్న ను పార్టీ అధ్యక్షునిగా చేయడం ద్వారా అమరావతి ఉద్యమం వల్ల ఉత్తరాంధ్రలో వచ్చిన వ్యతిరేకతను కొంత వరకు తగ్గించినట్లవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

ఈపార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా వంగలపూడి అనిత (పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే)ను నియమించి ఉత్తరాంధ్రకు ఇంకో పదవి ఇచ్చినట్టు అయింది. రాష్ట్రంలో చూస్తే అచ్చెన్న కన్నా మెరుగైన అభ్యర్థి కూడా చంద్రబాబుకు కనిపించడం లేదు. పైగా ఈయన బీసీ వర్గం కావడం మరో అనుకూల అంశం. దీంతో అచ్చెన్నాయుడికి రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకే పదవి దక్కుతుందని అంటున్నారు. అలా అయితే ఒకే జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు కళా వెంకటరావు, అచ్చెన్న పార్టీ పీఠం అధిష్టించినట్లు అవుతుంది. ఆ జిల్లా నుంచి గతంలో మజ్జి తులసీదాసు ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసారు.