iDreamPost
android-app
ios-app

కాఫీ లాంటి స్వీట్ మెలోడీ పిల్లా

  • Published Mar 11, 2020 | 11:45 AM Updated Updated Mar 11, 2020 | 11:45 AM
కాఫీ లాంటి స్వీట్ మెలోడీ పిల్లా

ప్రతి దర్శకుడికి ఒక స్టైల్ ఉంటుంది. దర్శకత్వంతో పాటు సంగీతంలోనూ ఆ మార్కును గమనించవచ్చు. సెన్సిటివ్ లవ్ స్టోరీస్ తీయడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న శేఖర్ కమ్ముల కొత్త సినిమా లవ్ స్టోరీలోని మొదటి ఆడియో సింగల్ ని ఇందాక రిలీజ్ చేశారు. పవన్ సిహెచ్ సంగీతంలో చైతన్య పింగళి సాహిత్యం సమకూర్చిన ఈ గీతం స్వీట్ మెలోడీగా సాగింది. ఎక్కువ క్లిష్టమైన పదాలు లేకుండా ఈజీగా అర్థమయ్యేలా ఇష్టపడిన అమ్మాయి గురించి అబ్బాయి పాడుకునే పాటగా నీట్ గా కంపోజ్ చేశారు పవన్.

‘ఏ పిల్లా పరుగున పోదామా ఏ వైపో జంటగా ఉందామా, రారా కంచె దూకి చకచకా ఊరుకుతూ ఆ రంగుల విల్లులు తీసి నీ వైపు వంతెన వేసి రావా” అంటూ హరి చరణ్ స్వరంలో సాగిన ట్యూన్ మెల్లగా ఆకట్టుకునేలా సాగింది. అయితే మరీ యునీక్ అనిపించేలా కాకుండా వినగా వినగా బానే ఉందనిపించేలా సాగడం ఒక్కటే దీని గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది. ఇన్స్ టాంట్ గా కనెక్ట్ అయ్యే స్థాయిలో లేదు కానీ లేట్ గా అయినా మెదడులో ఎక్కే సూచనలు ఉన్నాయి.

లిరికల్ వీడియోలో నాగ చైతన్య, సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీని చక్కగా చూపించారు. చాలా రోజుల తర్వాత తెలుగు స్ట్రెయిట్ మూవీలో కనిపిస్తున్న సాయి పల్లవి చైతుల జంట ఫ్రెష్ గా ఉంది. పవన్ కంపోజింగ్ లో కొంచెం సౌండ్ ఎక్కువైనట్టు అనిపించినా మొత్తంగా పాస్ మార్కులతో ఓకే అనిపించుకున్నాడు. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కానీ లవ్ స్టోరీ వేసవికే ప్లాన్ చేశారు. కాకపోతే మేలో వస్తుందా అంతకన్నా లేట్ అవుతుందా అనే క్లారిటీ లేదు. ఫిదా తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ మూవీ మీద ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. దీనికన్నా బెటర్ ట్రాక్స్ ఇకపై వస్తే శేఖర్ కమ్ముల నుంచి మరో మ్యూజికల్ హిట్ వచ్చినట్టే.

Song Link @ bit.ly/338hoZD

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş