iDreamPost
android-app
ios-app

లాజిక్కే క‌దా ‘బాబూ’..!

లాజిక్కే క‌దా ‘బాబూ’..!

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల హిందూత్వ వాదం బాగా వినిపిస్తున్నారు. భ‌క్తిభావం తెగ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అది నిజంగా దేవుడిపై భ‌క్తితోనో, ప్ర‌జ‌ల‌పై ప్రేమ‌తోనో అయితే ప‌ర్వాలేదు. రాజ‌కీయాల కోస‌మే దేవుడిని కూడా అడ్డం పెట్టుకున్నార‌ని ఇప్పుడు ఆయ‌న‌పై ప్ర‌ధాన ఆరోప‌ణ‌. సున్నితమైన అంశాల ప‌ట్ల ఎంత త‌క్కువగా స్పందిస్తే అంత మంచిది. అతిగా స్పందించ‌డం వ‌ల్ల రాజ‌కీయ ల‌బ్ధి సంగ‌తి ఎలాగున్నా.. ప్ర‌శాంతమైన‌ వాతావ‌రణానికి భంగం వాటిల్లుతుంది. అది ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌పై ప్ర‌భావం చూపుతుంది. కానీ ఇదేమీ ఆలోచించ‌కుండా ప్ర‌తీదీ రాద్ధాంతం చేయ‌డం ద్వారా త‌మ ప‌బ్బం గ‌డుపుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది టీడీపీ. దీనిలో భాగంగానే చంద్ర‌బాబునాయుడు రామ‌తీర్థంలో రాజ‌కీయ ర‌చ్చ సృష్టించారు. బాబు రాజ‌కీయాల‌ను వైసీపీ నేత‌లు తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి అవంతి శ్రీ‌నివాస‌రావు వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గామారాయి.

ఎపుడైనా చంద్రబాబు తలనీలాలు సమర్పించారా..?

ఏపీలో తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌రుడిని అక్క‌డి ప్ర‌జ‌లు ఆరాధ్య‌దైవంగా కొలుస్తారు. కొండ‌కు వెళ్లిన భ‌క్తుల‌లో దాదాపు అంద‌రూ స్వామి వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించ‌డం ప‌రిపాటి. దీన్నే లెవనెత్త‌తూ అవంతి శ్రీ‌నివాస్ చంద్ర‌బాబుకు సూటి ప్ర‌శ్న వేశారు. నిజ‌మైన హిందూత్వ‌వాది అయితే.. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నపుడు ఎపుడైనా చంద్రబాబు తలనీలాలు సమర్పించారా అంటూ ప్ర‌శ్నించారు. మంత్రి వ్యాఖ్య‌ల‌కు సోష‌ల్ మీడియాలో చాలా మంది ఒత్తాసు ప‌లుకుతున్నారు. చాలాసార్లు చంద్ర‌బాబు తిరుప‌తి వెంక‌న్న‌ను ద‌ర్శ‌నం చేసుకున్నారు. కానీ ఎప్పుడూ త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన‌ట్లు క‌నిపించ లేదు. ఈ పాయింట్‌నే అవంతి లేవదీశారు. బాబు రాష్ట్రంలో మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఏపీలో లేని పోని గొడవలు చేయడానికి మత రాజకీయాలకు బాబు తెర తీశారని కూడా అవంతి ఆరోపించారు. చంద్రబాబు వైసీపీ మీద క్రిస్టియానిటీ ముద్ర వేయడానికి చూస్తున్నారని కూడా నిందించారు. ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా మతాల మీద చర్చ జరగడానికి బాబు వైఖరి కారణమని ఆయన అన్నారు. చంద్రబాబు పొలిటికల్ ట్రాప్ లో బీజేపీ పడకూడదని మంత్రి సలహా ఇచ్చారు.