iDreamPost
android-app
ios-app

వాననీరు, పచ్చి చేపలే ఆహారంగా.. సముద్రంలో 2నెలలు గడిపిన వ్యక్తి!

వాననీరు, పచ్చి చేపలే ఆహారంగా.. సముద్రంలో 2నెలలు గడిపిన వ్యక్తి!

ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. అలానే కొందరికి  ఒంటరిగా విహారయాత్రలు చేయాలని కోరుకుంటారు. దట్టమైన అడవి, సముద్రం, భయంకరమైన గుహాలు వంటి ప్రాంతాల్లో టూర్లు వేస్తుంటారు. దాదాపు ఈ యాత్రలో ఎంతో సంతోషంగా, హాయిగా సాగుతుంటాయి. కానీ కొన్ని సార్లు ఈ సాహస యత్రలు ప్రాణాలకే ప్రమాదం తెస్తాయి.  అలా సాహసయాత్రలకు వెళ్లిన కొందరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరికొందరు ఏదో ఒక ఆహారం తింటూ జనాలు కనిపించే వరకు ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు. పసిఫిక్ మహా సముద్రంలో తప్పిపోయిన ఆ వ్యక్తి పచ్చి చేపలు తింటూ, వర్షపు నీరు తాగుతూ.. 2 నెలలు గడిపాడు. మరి.. అతడు ఎలా బతికి బయటపడ్డాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతానికి చెందిన టిమ్‌ షాడోక్‌ అనే 54 ఏళ్ల నావికుడు పసిఫిక్ మహాసముద్రంలో యాత్రకు వెళ్లాడు. ఈ ఏడాది ఏప్రిల్  నెలలో షాడోక్‌.. తన శునకం బెలతో కలిసి మెక్సికోలోని లా పాజ్‌ నుంచి ఫ్రాన్స్‌లోని పాలినేషియాకు పడవలో బయలుదేరాడు. మొత్తం 6 వేల కిలోమీటర్ల ప్రయాణం చేయాలని షాడోక్ ముందుగానే ప్లాన్ వేసుకున్నాడు. కొన్ని వారాల పాటు అతడి ప్రయాణం ఎంతో హాయిగా సాగింది. ఆ తర్వాత మార్గమధ్యలో ప్రమాదవశాత్తు తుపాన్‌ రావడంతో అతడి ఓడ దెబ్బతింది.  అందులో ఉన్న ఇంజిన్ భాగాలు చెడిపోయాయి.

ఈ క్రమంలో షాడోక్‌ ఎవరినీ సంప్రదించే వీలు లేకుండా పోయింది. నెలల తరబడి పసిఫిక్ మహాసముద్రంలో ఒంటరిగా కాలం వేలదీశాడు. అతడికి తోడుగా కేవలం పెంపుడు కుక్క మాత్రమే ఉంది. చీకటి పడగానే సముద్రంలో వచ్చే శబ్ధాలకు భయపడ్డాడు. ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో  గుండె ధైర్యం చేసుకుని కాలాన్ని నెట్టుకొచ్చాడు. నెలల తరబడి పసిఫిక్‌ మహా సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ మధ్యలో చిక్కుకుపోవడం వల్ల సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండె ధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి షాడోక్ ఉండే వైపు రావడం వల్ల వారు అతడ్ని గుర్తించి రక్షించారు. ఇక ఈ రెండు నెలలు సముద్రంలో పచ్చి చేపలను తింటూ, వర్షం పడినప్పుడు ఆ నీటిని భద్రపరుచుకుని తాగుతూ ప్రాణాలు కాపాడుకున్నాడు​. రాత్రివేళ ఓడలోని టెంట్‌లో తలదాచుకునేవాడు.

ఇలా రెండు నెలలపాటు సముద్రంలో ఎదురైన కష్టాలను తట్టుకుంటూ జీవించాడు. ఈ ఆస్ట్రేలియ నావికుడు రక్షించిన ఫోటోలను మెక్సికన్‌ ట్యూనా పడవ సిబ్బంది విడుదల చేశారు. సముద్రపు ఒడ్డుకు 1,900 కి.మీ దూరంలో షాడోక్ ను గుర్తించినట్లు తెలిపారు. మెక్సికన్ పడవ వాళ్లు రక్షించే సమయంలో షాడోక్‌, అతని శునకం విషమ స్థితిలో ఉన్నారంట. వెంటనే వారి ఓడలోని ఆహారం, నీరు షాడోక్‌కు అందించి ప్రథమ చికిత్స చేశారు. షాడోక్‌ , అతడి శునకం ఆరోగ్యం నిలకడగా ఉందని వారిని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  ఫ్లైట్ టేకాఫ్ చేసే సమయంలో పేలిన స్మార్ట్ ఫోన్.. పైలట్ వెంటనే..!