iDreamPost

ఫ్లైట్ టేకాఫ్ చేసే సమయంలో పేలిన స్మార్ట్ ఫోన్.. పైలట్ వెంటనే..!

ఫ్లైట్ టేకాఫ్ చేసే సమయంలో పేలిన స్మార్ట్ ఫోన్.. పైలట్ వెంటనే..!

స్మార్ట్ ఫోన్స్ వాడకం ఎంతగా పెరిగిపోయిందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలతో మొదలు పెట్టి లక్షలు ఖర్చు చేసి స్మార్ట్ ఫోన్స్ కొంటున్నారు. స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ, ఈ మధ్యకాలంలో అవి పేలిపోతున్న సంఘటనలు చాలానే చూశాం. అయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, బాగా హీటైనప్పుడు పేలిపోవడం చూసుంటారు. కానీ, ఫ్లైట్ లో ఫోన్ పేలిపోవడం చూశారా? అది కూడా జరిగింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ కు రెడీ అయిన సందర్భంలో ఓ పాసింజర్ కు చెందిన స్మార్ట్ ఫోన్ పేలిపోయింది.

వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఉదయిపూర్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం రన్ వేపై సిద్ధంగా ఉంది. ఆ ఎయిర్ ఇండియా విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ చేసేందుకు కొన్ని నిమిషాల ముందే ఫ్లైట్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫోన్ పేలగానే ఫ్లైట్ మొత్తం ఒక షాక్ వేవ్ వచ్చినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు భావిస్తున్నారు.

అయితే ఈ పేలుడు జరిగిన సమయంలో విమానం టేకాఫ్ అయిందా? ఇంకా రన్ వే మీదే ఉందా అనే దానిపై స్పష్టత లేదు. కొందరు మాత్రం ఆ ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత అత్యవరసంగా ల్యాండింగ్ చేసినట్లు చెప్పారు. కానీ, కొందరు మాత్రం టేకాఫ్ కి ముందే ఈ ప్రమాదం జరిగిందని.. పైలట్ టేకాఫ్ చేయకుండా ఆపేసినట్లు చెప్పారు. పైలట్ నిర్ణయంతో ముందు జాగ్రత్త చర్యగా కొందరు ప్రయాణికులను కూడా కిందకు దింపేసినట్లు సమాచారం. ఈ ఘటన వల్ల ఫ్లైట్ గంట ఆలస్యం అయింది.

విమానాన్ని పూర్తిగా పరిశీలించి.. అవసరమైన చిన్న రిపేర్లు చేసిన తర్వాత విమానానికి క్లియరెన్స్ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో.. ఏవియేషన్ అధికారులు, స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా ఆలోచన చేయాల్సి ఉందని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు ఇళ్లల్లో జరిగాయి కాబట్టి తీవ్రత చాలా తక్కువగా ఉంది. అదే ఎగురుతున్న విమానంలో జరిగింతే వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంటూ హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి