iDreamPost
android-app
ios-app

బురదంత స్పష్టంగా….

బురదంత స్పష్టంగా….

ఇరాన్ దేశ ఖడ్స్ ఫోర్స్ జనరల్ ఖాసీం సులేమానిని అమెరికా హతమార్చడంతో “మధ్య ప్రాచ్య” దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా మధ్య ఆసియా దేశాలపై పట్టు కోసం అమెరికా ఎప్పటినుండో ప్రయత్నిస్తూనే ఉంది. అసలు అమెరికాకు అక్కడి దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎందుకు తల దూరుస్తుంది అనే దానికి సరైన వివరణ ఎవ్వరూ ఇవ్వలేక పోయారు. కానీ ముడి చమురు లభించే దేశాలపై పట్టు కోసం అమెరికా ప్రయత్నిస్తుందనే వాదనా లేకపోలేదు.

కానీ అమెరికా మధ్య ఆసియ దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తుందో Aubrey Bailey అనే ఆవిడ “CLEAR AS MUD” పేరుతో ఐదేళ్ల క్రితమే వివరించే ప్రయత్నం చేసింది. ఆ న్యూస్ ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఎంత అర్ధం చేసుకుందామన్నా అర్ధం కానీ గజిబిజి రాతల్లా కనిపించే Aubrey Bailey అక్షరాల్లో అర్ధాలను వెతికి ఆలోచిస్తే అమెరికాతో పాటు కొన్ని దేశాలు అనుసరించే విదేశీ వ్యవహారాలు అర్ధవంతంగా అర్ధంకాని రీతిలో అర్ధం అవుతాయి.

CLEAR AS MUD

We support the Iraqi government in the fight against the Islamic State. We don’t like IS but IS is supported by Saudi Arabia, whom we do like. We don’t like President Assad. We support the fight against him but not IS which is also fighting against him.

We don’t like Iran but Iran supports the Iraqi government against IS. So, some of our friends support our enemies and some of our enemies are our friends and some of our enemies are fighting against our other enemies whom we want to lose but we don’t want our enemies who are fighting our enemies to win.

If the people we want to defeat are defeated, they might be replaced by people we like even less. And all this was started by us invading a country to drive out terrorists who weren’t actually there until we went in to drive them out.

Do you understand now?

“మధ్యప్రాచ్యంలో ఏమి జరుగుతుందో మీరు అయోమయంలో ఉన్నారా? నన్ను వివిరించనివ్వండి.

మనం (అమెరికా) ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కి వ్యతిరేకంగా ఇరాక్ ప్రభుత్వంతో కలిసి పోరాడుతున్నాం. మనకి ఐఎస్ అంటే ఇష్టం లేదు. సౌదీ అరేబియా ఐఎస్ ని సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి సౌదీ అంటే ఇష్టం. మనకి సిరియా అధ్యక్షుడు అసద్ అంటే ఇష్టం లేదు. అతనికి వ్యతిరేకంగా జరిగే యుద్ధాన్ని మనం సపోర్ట్ చేస్తాం. కానీ ఆ యుద్ధం చేస్తున్న వాళ్ళలో మనకి అసలు ఇష్టం లేని ఐఎస్ కూడా ఉంది.

మనకి ఇరాన్ అంటే ఇష్టం లేదు. కానీ ఇరాన్ ఐఎస్ మీద యుద్ధం చేస్తున్న ఇరాకీ ప్రభుత్వానికి సపోర్టు ఇస్తుంది. అంటే మన మిత్రుల్లో కొందరు మన శత్రువులకి సపోర్టు ఇస్తారు. అందువల్ల మన శత్రువుల్లో కొందరు మన మిత్రులనమాట. అదే సమయంలో మన శత్రువుల్లో కొందరు మన ఇతర శత్రువుల మీద యుద్ధం చేస్తున్నారు, వాళ్లు ఓడకూడదని మన ఉద్దేశం.

కానీ మన శత్రువుల మీద యుద్ధం చేసే శత్రువులు నెగ్గకూడదని కూడా మనకి ఉంది.ఇప్పుడు మనం ఓడిపోవాలనుకుంటున్న వాళ్ళు ఓడిపోతే ఆ స్థానాల్లో వచ్చే వాళ్ళు మనకి ఇంకా అసలు నచ్చని వాళ్ళు కావచ్చు. అసలిదంతా ఎందుకు మొదలయ్యిదంటే, మనం ఓ దేశంలో టెర్రరిస్టుల్ని తరిమెయ్యాలని దాని మీదకి సైన్యంతో వెళ్లినందువల్ల. కానీ నిజానికి మనం వెళ్లే ముందు అక్కడ టెర్రరిస్టులు లేనే లేరు. మనం వెళ్లాక వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని తరిమెయ్యడానికి వెళ్లామన్నమాట.” ఇప్పుడు బాగా అర్థమైంది కదా.

ఐదేళ్లక్రితమే ప్రచురించబడిన ఈ వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇది చదవడానికి tongue-twister లా అనిపించినా ఈ పదాల్లో దాగున్న నిగూఢ అర్ధం తెలిస్తే అగ్రదేశం అనుసరించే విదేశీ విధానాలు ఎంత కుటిలత్వంతో కూడుకుని ఉంటాయో బట్టబయలు చేస్తుంది. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఎలా ఇతర దేశాల వ్యవహారాల్లో అగ్రరాజ్యాలు స్పందిస్తాయో తెలిపే విధంగా ఆబ్రే బెయిలీ ఐదేళ్ల క్రితమే రాయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.